DailyDose

పాతకార్లకు భారత్‌లో భారీ డిమాండ్-వాణిజ్య-09/05

Used Cars Have Huge Demand In India-Telugu Business News-09/05

* ఓ వైపు ప్యాసెంజర్ వెహికిల్ ఇండస్ట్రీ సేల్స్ ఎన్నడూ లేనంతగా పడిపోతూ ఉంటే… మరోవైపు దేశంలో యూజ్డ్ కార్ల అమ్మకాలు మాత్రం శరవేగంగా దూసుకుపోతున్నాయి. పాత కార్ల అమ్మకాలపై ఆర్థిక మాంద్య ప్రభావం ఏ మాత్రం లేదని తాజా రిపోర్ట్‌‌‌‌‌‌‌‌లు చెబుతున్నాయి. పాతకార్లకు దేశంలో అతిపెద్ద ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ మార్కెట్ ప్లేస్ అయిన ఓఎల్‌‌‌‌‌‌‌‌ఎక్స్.. ఈ ఏడాది పాత కార్ల అమ్మకాలు కనీసం 10 శాతం వరకు పెరుగుతాయని అంచనావేస్తోంది. అంటే ఈ క్యాలెండర్ ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 44 లక్షల యూనిట్ల వరకు పాత కార్లు అమ్ముడుపోతాయని లెక్కకడుతోంది. ఇదే సమయంలో కొత్త కార్ల అమ్మకాలు 6 శాతం వరకు తగ్గుతాయని పేర్కొంటోంది.
*ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి (మార్చి 31) నాటికి అలహాబాద్ బ్యాంక్ను తనలో విలీనం చేసుకునే ప్రక్రియ పూర్తి కానుందని ఇండియన్ బ్యాంక్ భావిస్తోంది. గత వారం ప్రభుత్వ బ్యాంకింగ్ రంగంలో ఒకేసారి నాలుగు విలీనాలను ప్రకటించారు
*సహారా ఇన్వెస్టర్లకు రూ.106.10 కోట్ల మొత్తాలను రిఫండ్ చేసినట్లు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ వెల్లడించింది. కోట్లాది మంది ఇన్వెస్టర్ల నుంచి సహారా గ్రూప్ రూ.24 వేల కోట్లను సమీకరించినట్లు వెల్లడి కావటంతో ఆ మొత్తాలను తిరిగి చెల్లించాలని సుప్రీం కోర్టు గతంలో ఆదేశించిన సంగతి తెలిసిందే. నగదు రిఫండ్కు సంబంధించి ఇన్వెస్టర్ల నుంచి దాదాపు 20 వేలకు పైగా క్లెయిమ్స్ వచ్చాయని, ఇందులో మూడింట రెండొంతుల క్లెయిమ్స్కు సొమ్మును చెల్లించినట్లు సెబీ తెలిపింది.
*చత్తీ్సగఢ్ నాగర్నార్లోని స్టీల్ ప్లాంట్లో ముడి సరుకు నిర్వహణ ప్రాజెక్టుకు మళ్లీ బీహెచ్ఈఎల్నే కొనసాగించాలని ఎన్ఎండీసీ నిర్ణయించింది. ప్లాంటులో ముడి సరుకు నిర్వహణ విధానాన్ని అభివృద్ధి పరిచే కాంట్రాక్టును ఎన్ఎండీసీ 2011లో బీహెచ్ఈఎల్కు ఇచ్చింది.
*దివాలా ప్రక్రియను ఎదుర్కొంటున్న జెట్ ఎయిర్వే్సను కొనుగోలు చేసేందుకు ఎవరు ముందుకు వచ్చే పరిస్థితి కనిపించటం లేదు. జెట్ కొనుగోలుకు సంబంధించి ఆసక్తి గల కొనుగోలుదారులు తమ ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ)లను సమర్పించేందుకు గడువు తేదీని పెంచినప్పటికీ కొత్తగా ఎవరు ముందుకు రాకపోవటం గమనార్హం.
*లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ‘ఇన్సూరెన్స్ వీక్’ను నిర్వహిస్తోంది. 63వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లో దక్షిణ మధ్య ప్రాంత జోనల్ మేనేజర్ మిని ఐపీ మంగళవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
*ప్రభుత్వ రంగంలోని ఐడీబీఐ బ్యాంక్కు రూ.9,300 కోట్ల మూలధన నిధులను అందించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బ్యాంకు మూలధనాన్ని పెంచటంతో పాటు లాభాల్లోకి మళ్లించేందుకు ఈ నిధులు తోడ్పడతాయని కేబినెట్ భేటీ అనంతరం సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు.
*పాన్ కార్డు లేకుండా ఆదాయ పన్ను రిటర్నులు దాఖ లు చేసిన వారికి ఓ శుభవార్త. ఇలా రిటర్నులు దాఖలు చేసిన వారికి నేరుగా పాన్ కార్డును పంపించనున్నట్లు ఐటీ శాఖ అధికా రులు వెల్లడించారు. ఇందుకోసం వారు ప్రత్యేకంగా ఎలాంటి ధ్రు వీకరణ పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదన్నారు.