ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తీహార్ జైల్లో ఖైదీగా చేరిన కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తోలి రాత్రి నిద్ర లేకుండా గడిపారట. నిన్నటి వరకు సీబీఐ కస్టడిలో ఆ కార్యాలయంలో అన్ని సౌకర్యాలు అనుభవించిన చిదంబరం గత రాత్రి ఎనిమిది గంటలకు తీహార్ జైలుకు తరలించారు. తొలిసారిగా కటకటాలు చూసిన చిదంబరం ఉద్వేగానికి గురైనట్లు సమాచారం. రాత్రంతా నిద్రలేకుండానే గడిపిన చిదంబరం తెల్లవారుజామున నాలుగు గంటలకు ఒక కునుకు తీశారు. తీహార్ జైల్లో ఏడో నెంబరు బ్యారేక్ లో ఐదో నంబరు గదిని ఆయనకు కేటాయించారు. జైలు సిబ్బంది ఆహారం అందించినప్పటికీ ఆయన ముట్టుకోలేదు. కొన్ని ద్రవ పదార్దాలు మాత్రం సేవించారు. ఆయనకు ఒక మంచం, ఆరు దుప్పట్లు, ఒక టేబుల్ ప్యాన్ జైలు సిబ్బంది అందించారు. వెస్టర్న్ టాయిలెట్ సౌకర్యాన్ని కల్పించారు. చిదంబరాన్ని ఉంచిన ఏడో నంబరు బ్యారక్ లోనే జమ్ముకాశ్మీర్ వేర్పాటు ఉద్యమ నాయకుడు యాసిన్ మాలిక్ ఉన్నారు. ఐదవ నంబరు గదిలో చిదంబరం ఒక్కరే ఉన్నారు. ఆయనకు భద్రతను కల్పించారు.
జైల్లో కునుకు లేకుండా గడిపిన చిదంబరం
Related tags :