ఐఎన్‌ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం.. బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇవాళ చిదంబరం తరపు న్యాయవాది సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం లేదా బుధవారం ఈ పిటిషన్‌ను విచారించనుంది.ఈడీ దర్యాప్తు చేస్తున్న ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో చిదంబరం దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. ఈ కేసులో ఆయన కీలక పాత్ర పోషించినట్టు కోర్టు అభిప్రాయపడింది. ఆయనకు బెయిల్ ఇస్తే, సమాజానికి తప్పుడు సందేశం పంపినట్టు అవుతుందని కోర్టు అభిప్రాయపడింది. బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చడంతో చిదంబరం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
నన్ను ఆదుకోండి..సుప్రీంను ఆశ్రయించిన చిదంబరం
Related tags :