అమెరికా చట్ట నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ గూగుల్.. 170 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.1,200 కోట్లు) జరిమానాను చెల్లించనుంది. ఆ సంస్థకు చెందిన యూట్యూబ్.. చిన్నారుల వ్యక్తిగత డేటాను వారి తల్లిదండ్రుల అనుమతి లేకుండా తీసుకుంది. వ్యాపార ప్రయోజనాల కోసం వీటిని వినియోగించింది. ఈ ఆరోపణల నేపథ్యంలో న్యూయార్క్ స్టేట్ అటార్నీ జనరల్, ఫెడరల్ ట్రేడ్ కమిషన్ విచారణ జరిపాయి. ఈ మేరకు గూగుల్.. ఫెడరల్ ట్రేడ్ కమిషన్కు 136 మిలియన్ డాలర్లు, న్యూయార్క్ స్టేట్కు 34 మిలియన్ డాలర్లు చెల్లించనుంది.
₹1200కోట్లు కట్టు
Related tags :