ముఖ్యమంత్రి జగన్ వంద రోజుల పాలనకు మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వందకు వంద మార్కులు వేసారు. అదే సమయంలో కొన్ని సూచనలు చేసారు. ప్రభుత్వంలో ఉన్నా..ప్రతిపక్షంలో ఉన్నా జగన్ ఎప్పుడూ మా వాడేనంటూ చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వ నిర్ణయాలను మైక్రో స్కోప్ లో చూడాలి తప్ప దాన్ని పగుల గొట్టి చూస్తే ఎలా అని ప్రశ్నించారు. వర్స్ టెండరింగ్ లో కొన్ని తప్పిదాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి జగన్ కిందపడుతున్నాడు..లేస్తున్నాడు..చెయ్యి పట్టుకని నడిపించేవాడు కావాలని వ్యాఖ్యానించారు. తనను సలహాలు ఇవ్వాలని అడిగితే ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నానని జేసీ దివాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఆర్టీసీ విలీనం చేయటం పైన కీలక వ్యాఖ్యలు చేసారు.వందకు వంద మార్కులు వేస్తాను..జగన్ అధికారంలో ఉన్నా..ప్రతిపక్షంలో ఉన్న తమ వాడేనని వ్యాఖ్యానించారు. ఏపీకి మంచి జరగాలని..జగన్ ఇంకా మంచి పనులు చేయాలని పేర్కొన్నారు. జగన్ వంద రోజుల పాలనకు వందకు వంద మార్కులు వేస్తానని..వాస్తవంగా నూట పది మార్కులు ఇవ్వా లని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో జగన్ కొన్ని నిర్ణయాల విషయంలో కిందపడుతున్నాడు..లేస్తున్నాడు..చెయ్యి పట్టుకని నడిపించేవాడు కావాలని వ్యాఖ్యానించారు. రాజధాని అమరావతి నుండి తరలించే అంత తెలివి తక్కువ పని జగన్ చేయడని..చాలా తెలివిగలవాడని జేసీ కామెంట్ చేసారు. ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం మీద జేసీ స్పందించారు. ప్రైవేటు సంస్థలను ప్రభుత్వం తమ అదుపులో ఉంచుకోవాలని..ప్రైవేటు వారితో కలసి ప్రభుత్వం వ్యాపారం చేయకూడదున్నారు. ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయడమంటే ప్రైవేటు వారితో వ్యాపారం చేయటమేనని వ్యాఖ్యానించారు. గ్రామ సచివాలయాలు ఆశించిన రీతిలో జరుగుతాయా లేదా అనేది చూడాలి అని చెప్పుకొచ్చారు.
జగన్‌కు జేసీ 100 పర్సెంట్ మార్కులు
Related tags :