Politics

కంభంపాటి కూడా భాజపాలోకి వెళ్తారా?

Khambhampati Rammohan Rao To Jump Into BJP

కంభంపాటి రామ్మోహన్ రావు మొన్నటి వరకు ఏపీ సర్కారుకు ఢిల్లీలో ప్రతినిధి. మాజీ రాజ్యసభ ఎంపీ. ఎన్నికల్లో తెదేపా ఓడిపోయిన తరువాత ఈయన అక్కడక్కడా కనిపించేవారు. టీవీ చర్చల్లో పాల్గొనేవారు. జగన్ ను నోటి కొచ్చినట్లు మాట్లాడేవారు కాని నెలరోజుల నుంచి ఈయన కనిపించడంలేదు. టీవీ చర్చలకు రావడంలేదు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. తెదేపాకి ఈయన కూడా గుడ్ బై చెప్పబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. సుజనా, సిఎం.రమేష్ తరహాలో ఈయన కూడా కాషాయ కండువా కప్పుకుంటాడని తెలుస్తోంది. ఇప్పటికే భాజపా నేతల టచ్ లోకి వెళ్ళినట్లు సమాచారం. ఢిల్లీ స్థాయిలో ఏదో ఒక పదవి ఇస్తే పార్టీలోకి వస్తానని షరతు పెట్టినట్టు చెబుతున్నారు. కంభంపాటి రాజ్యసభ సీటు ఆశించారు. కానీ ఆయనకు రాలేదు. దీంతో అప్పటి నుంచి తెదేపా వ్యవహారాల్లో ఆయనకు ప్రాధాన్యత తగ్గింది. రామోజీరావుతో ఉన్న సాన్నిహిత్యాన్ని ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఈయనను నియమించారు. దీంతో పార్టీ తరపున టీవీ చర్చల్లో ఈయన పాల్గొనేవాడు. ఏపీలో టీడీపీ సీన్ అయిపోయిందని అనుకుంటున్న నేతల్లో ఈయన ఒకడు. ఈయన కూడా భాజపా వైపు చూస్తున్నాడట. ఇప్పటికే వెంకయ్యనాయుడు ఆశీస్సులతో కమల తీర్ధం త్వరలోనే పుచ్చుకుంటాడని తెలుస్తోంది.