1. నెలవంక అందే వేళ!
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన ‘చంద్రయాన్-2’లోని ‘విక్రమ్’ ల్యాండర్ శుక్రవారం అర్ధరాత్రి దాటాక జాబిల్లి ఉపరితలంపై అడుగుపెట్టనుంది. ఈ వ్యోమనౌక చేయబోయే ఆవిష్కరణలు, చెప్పబోయే కొత్త సంగతుల కోసం భారతదేశంతోపాటు ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ ఏడాది జులై 22న మధ్యాహ్నం 2.43 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ‘చంద్రయాన్-2’ నింగిలోకి దూసుకెళ్లింది.
2. కొత్త సచివాలయం కట్టాల్సిందే
తెలంగాణ ప్రస్తుత సచివాలయం అధ్వానంగా ఉందని, మార్పులు, మరమ్మతులు చేయడం వృథా అని రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదించింది. దానిని కూల్చివేసి కొత్త సచివాలయ నిర్మాణం చేపట్టాలని సూచించింది. సచివాలయ నిర్మాణంపై సీఎంకు ఇచ్చిన నివేదికలో ఈ కీలక సిఫార్సు చేసింది. కమిటీ నివేదికపై త్వరలో మంత్రిమండలిలో చర్చించి ఆమోదం పొందాలని సీఎం నిర్ణయించారు.
3. పోర్టల్‌లో పోలవరం టెండర్లు
పోలవరం ప్రధాన డ్యాంలో మిగిలి ఉన్న పనులకు, పోలవరం జలవిద్యుత్తు కేంద్రం పనులకు ఏపీ ప్రభుత్వం టెండర్ల ప్రక్రియను చేపట్టింది. ఈ-ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్‌లో గురువారం ఈ మేరకు టెండర్ల వివరాలను అప్‌లోడ్ చేసింది. ఇంతకు ముందు ఇచ్చిన టెండర్ నోటీసుల ప్రకారమే ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు ఇందులో పేర్కొంది. పోలవరం జలవిద్యుత్తు కేంద్రం రీ టెండరింగ్ ప్రక్రియను నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించినా ప్రభుత్వం ముందుకు వెళ్లాలనే నిర్ణయించింది.
4. వాస్తవిక అంచనాలతో రాష్ట్ర బడ్జెట్
తెలంగాణ పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రజల ఆకాంక్షలకు, రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా వాస్తవిక అంచనాలతో రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ప్రాధాన్యాంశాలకు పెద్దపీట వేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అన్నారు. ఈ నెల 9 నుంచి జరగనున్న శాసనసభ బడ్జెట్ సమావేశాలను పురస్కరించుకొని 2019-20 పూర్తిస్థాయి రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనపై ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు.
5. ఏ రోజు పరీక్షా ఫలితాలు ఆరోజే
తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రులకొచ్చే జ్వర బాధితులకు చేసే నిర్ధారణ పరీక్షల ఫలితాలను ఏరోజుకారోజే అందజేయాలని వైద్యఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. గురువారం ఆరోగ్య కుటుంబ సంక్షేమ కార్యాలయంలో జ్వరాలపై ముఖ్యకార్యదర్శి సమీక్షించి, అధికారులకు కీలక ఆదేశాలు జారీచేశారు. కొన్నిచోట్ల పారాసెటమాల్ మాత్రలు, ద్రావణాలు, కొన్ని రకాల యాంటీ బయాటిక్స్, ఐవీ ద్రావణాల కొరత ఏర్పడిందని తెలుస్తోందనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ రోగులకు అసౌకర్యం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
6. ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం
ప్రజాసమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తూ.. అవి పరిష్కారమయ్యేలా కృషి చేయడం మన ముందున్న కర్తవ్యమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా దిండి రిసార్ట్స్‌లో గురువారం పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ దిండి రిసార్ట్స్ వద్దకు వచ్చి జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను కలుసుకున్నారు. ఆయన జనసేనలో చేరతారన్న ఊహాగానాలు వినిపించాయి.
7. అంతర్జాతీయ ఆ‘మోదీ’యం!
సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించి.. భారత ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ విజయవంతంగా 100 రోజుల పాలన మార్కును చేరుకున్నారు. దేశంలో సంస్కరణలకు పెద్దపీట వేస్తున్న మోదీ విదేశీ వ్యవహారాలకూ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. మొదటి 100 రోజుల్లో 17 రోజులు విదేశీ పర్యటనల్లోనే ఉండటం ఇందుకు నిదర్శనం. గతంలో ఏ ప్రధానీ వెళ్లని దేశాల్లో పర్యటించారు.
8. రష్యాకు రూ. 7 వేల కోట్ల భారత్ రుణం
భారత్- రష్యా సంబంధాల్లో అసాధారణ దృశ్యం ఆవిష్కృతమయింది. అభివృద్ధి చెందిన దేశంగా పరిగణిస్తున్న రష్యాకే భారత్ ఒక బిలియన్ డాలర్ల (రూ.7,000 కోట్లు) రుణం ఇవ్వనుంది. ఆ దేశంలో ‘దూర ప్రాచ్య’ (ఫార్ ఈస్ట్) ప్రాంతాలుగా పిలిచే తూర్పు రాష్ట్రాల అభివృద్ధికి ఈ రుణం కేటాయించనుంది. వినియోగం, తిరిగి చెల్లింపులు, వడ్డీల విషయంలో సులభతర నిబంధనలు ఉండే లైన్ ఆఫ్ కెడ్రిట్ రూపంలో దీన్ని మంజూరు చేయనుంది.
9. జమ్మూ-కశ్మీర్‌లో ఏడేళ్లు పన్నులుండవ్!
జమ్మూ-కశ్మీర్ రాష్ట్ర విభజన, ప్రత్యేక ప్రతిపత్తి రద్దు తర్వాత అక్కడ ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని చల్లార్చేందుకు బహుముఖ కార్యాచరణ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడ ఏర్పాటు చేసే పరిశ్రమలకు ఏడేళ్ల ‘పన్నుల విరామం’ (ట్యాక్స్ హాలిడే) ఇవ్వడానికి సిద్ధమవుతోంది. జీఎస్‌టీతో సహా అన్ని రకాల పన్నులకు మినహాయింపు ఇవ్వాలని ప్రతిపాదించింది. ఇందుకోసం 11 కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖల ద్వారా ఒక దీర్ఘకాలిక కార్యాచరణ ప్రణాళిక రూపొందింది. లద్దాఖ్‌కు కూడా ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించనుంది.
10. చిన్న యుద్ధ విమానం పరీక్షలు విజయవంతం
స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) రూపొందించిన చిన్న యుద్ధ విమానం (ఎల్‌యూహెచ్) హిమాలయ పర్వతాల్లో సామరథ్య పరీక్షలు ముగించుకుంది. అతి శీతల, అత్యధిక ఉష్ణోగ్రతలున్న వాతావరణంలో పరీక్షలు ముగించుకుని, యుద్ధానికి ఎల్‌యూహెచ్ సిద్ధమైనట్లు హెచ్‌ఏఎల్ ప్రకటించింది…
నేటి ప్రధాన వార్తలు
Related tags :