Devotional

శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదల

TTD Releases Arjitha Seva Tickets 2019 Sep Quota

1. శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదల – ఆద్యాత్మిక వార్తలు
శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించి డిసెంబరు నెల కోటాలో మొత్తం 68,466 టికెట్లను శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేసినట్లు టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. ఆన్‌లైన్‌ డిప్‌ విధానంలో 6,516 సేవా టికెట్లు విడుదల చేశామని, ఇందులో సుప్రభాతం 3,856, తోమాల 60, అర్చన 60, అష్టదళపాదపద్మారాధన 240, నిజపాదదర్శనం 2,300 టికెట్లు ఉన్నాయని ప్రకటించారు. ఆన్‌లైన్‌ జనరల్‌ కేటగిరిలో 61,950 సేవాటికెట్లు ఉన్నాయి. వీటిలో విశేషపూజ 2,500, కల్యాణం 13,775, ఊంజల్‌సేవ 4,350, ఆర్జిత బ్రహ్మోత్సవం 7,975, వసంతోత్సవం 15,950, సహస్రదీపాలంకారసేవ 17,400 టికెట్లు ఉన్నాయని వివరించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం జరిగింది. ఇందులో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానాలు ఇచ్చారు.
2. శ్రీవారికి జోడు పంచెల వితరణ
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి గురువారం ఉదయం జోడుపంచెలు వితరణగా అందాయి. ‘ఏరువాడ వస్త్రాలు’గా పిలిచే ఈ ‘జోడుపంచెలు’ను గద్వాల జోగులాంబ జిల్లాకు చెందిన మహంకాళి కరుణాకర్, సురేష్ సోదరులు రూ.లక్షన్నరతో తయారు చేశారు. గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం జోడుపంచెలను ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాధ్, పేష్కర్ లోకనాథానికి అప్పగించారు. వీటిని ఆలయంలోనే భద్రపరిచి బ్రహ్మోత్సవాల తొలిరోజున స్వామికి అలంకరిస్తారు. ఈ సందర్భంగా మహంకాళి సోదరులను పండితులు ఆశీర్వదించి శ్రీవారి లడ్డూప్రసాదం అందజేశారు.
3. వైభవంగా శ్రీ తిరుకవాట గ్రామ మహోత్సవం
యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడి ఆలయ పునర్నిర్మాణంలో మరో ఘట్టం ఆవిషృతమైంది. ఆలయ సప్తతల, పంచతల రాజగోపుర భారీ ద్వార కవాటాలు బోయిన్పల్లిలోని అనురాధ టింబర్స్ ఇంటర్నేషనల్లో తయారు చేశారు. ఈ సందర్భంగా శ్రీ తిరుకవాట గ్రామ మహోత్సవం నిర్వహించారు. గురువారం బోయిన్పల్లిలో మంత్రి చామకూర మల్లారెడ్డి, వైటీడీఏ, దేవస్థాన అధికారులు, ఆలయ ప్రధాన అర్చకులు పూజలు నిర్వహించిన అనంతరం ద్వారకవాట రఽథయాత్ర ప్రారంభమైంది. నృత్య, సంగీత, మేళ తాళాల నడుమ యాదాద్రి కొండపైకి చేరింది. యాదాద్రి ఆలయ ప్రధాన ద్వారాల తలుపులు తాము తయారుచేయడం అదృష్టంగా భావిస్తున్నామని చదలవాడ శరత్బాబు అన్నారు.
4. ఐశ్వర్య గణపతికి నీడ కరువు
భక్తుల కోరికలను ఈడేర్చే ‘ఐశ్వర్య గణపతి’కే నీడ లేకుండా పోయింది. ఆలయం నిర్మాణం జరగకపోవడంతో ఈ విగ్రహం వందల ఏళ్లుగా ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ పూజాదికాలు లేకుండా నిరాదరణకు గురవుతోంది. మహబూబ్నగర్ జిల్లా తిమ్మాజిపేట మండలం ఆవంచలో ఈ గణేషుడు కొలువుదీరాడు. అంత్యంత భారీగా ఉన్న ఈ గణనాథుడికి ఎన్నో విశిష్టతలు ఉన్నాయి! దేశంలోనే అతిపెద్ద ఏకశిల వినాయక విగ్రహం ఇది! దీనికి 879 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. క్రీ.శ 12వ శతాబ్దంలో పశ్చిమ చాళుక్య ప్రభువు తైలాపుడు ఈ ప్రాంతాన్ని పాలించేవాడు. ఆయనే ఆవంచలోని భారీ గుండును గణేషుడిగా మార్చే కార్యాన్ని చేపట్టాడు. దాదాపు 30 అడుగుల ఎత్తు, 15 అడుగుల వెడల్పుతో విగ్రహాన్ని చెక్కించాడు. పనులు మధ్యలో ఉండగానే తండ్రి విక్రమాదిత్యుడు మరణించాడనే వార్త తెలియడంతో తైలాపుడు గుల్బర్గా వెళ్లిపోయాడు. దాంతో విగ్రహం, ఆలయ నిర్మాణ పనులు ఆగిపోయాయి. పుణేకు చెందిన ఉత్తరాదేవి చారిటబుల్ ట్రస్టు.. ఆరేళ్ల క్రితం రూ.8కోట్లతో ఆలయ నిర్మాణానికి పూనుకొన్నా స్థానికులు సహరించకపోవడంతో వెనక్కి తగ్గినట్లు సమాచారం. విగ్రహ ప్రాశస్థ్యాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని, ఈ గణనాథుడికి ఆలయాన్ని కట్టించి, నిత్యపూజలు జరిగేలా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
5. తలనీలాల విక్రయం ద్వారా టిటిడి ఆదాయం రూ. 7.62 కోట్లు
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించిన తలనీలాల ఈ-వేలం గురువారం నిర్వ‌హించారు. త‌ద్వారా టిటిడి రూ. 7.62 కోట్ల ఆదాయాన్ని గడించింది.ప్రతినెలా మొదటి గురువారం నాడు తలనీలాల ఈ-వేలం జరుగుతున్న విషయం విదితమే. ఇందులోభాగంగా టిటిడి తిరుమల ప్ర‌త్యేకాధికారి శ్రీ ఎ.వి.ధ‌ర్మారెడ్డి పర్యవేక్షణలో తలనీలాల ఈ వేలం జరిగింది. మొదటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, తెల్లవెంట్రుకలు తలనీలాల రకాల ఈ-వేలం నిర్వహించారు. ఈ నెల నిర్వహించిన ఈ-వేలంలో మొత్తం 17,200 కిలోల తలనీలాలు అమ్ముడుపోయాయి.తలనీలాలలో మొదటి రకం(27 ఇంచుల పైన), రెండో రకం(19 నుండి 26 ఇంచులు), మూడో రకం(10 నుండి 18 ఇంచులు), నాలుగో రకం(5 నుండి 9 ఇంచులు), ఐదో రకం(5 ఇంచుల కన్నా తక్కువ) టిటిడి ఈ-వేలంలో పెట్టింది.మొదటి ర‌కం తలనీలాలో కిలో రూ.26,005/-గా ఉన్న ఏ క్యాట‌గిరి – 5,800 కిలోలను వేలానికి ఉంచగా, ఏవీ అమ్ముడుపోలేదు. కిలో రూ. 18,334/-గా ఉన్న బి క్యాట‌గిరి – 2000 కిలోలను వేలానికి ఉంచగా 100 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.18.33 ల‌క్ష‌ల‌ ఆదాయం లభించింది. రెండో రకం తలనీలాలో కిలో రూ.17,814/-గా ఉన్న ఏ క్యాట‌గిరి – 6,800 కిలోలను వేలానికి ఉంచగా 400 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.71.26 లక్షల ఆదాయం సమకూరింది. అదేవిధంగా కిలో రూ. 8,609/- గా ఉన్న బి క్యాట‌గిరి – 5,400 కిలోలు వేలానికి ఉంచగా, అన్నీ అమ్ముడు పోయాయి. తద్వారా రూ.465.30 ల‌క్ష‌ల‌ ఆదాయం లభించింది.మూడో రకం తలనీలాలో కిలో రూ.6,049/-గా ఉన్న ఏ క్యాట‌గిరి 1,800 కిలోలను వేలానికి ఉంచ‌గా, 500 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.30.25 లక్షల ఆదాయం లభించింది. కిలో రూ.4,554/-గా ఉన్న బి క్యాట‌గిరి – 33,800 కిలోలు వేలానికి ఉంచారు. ఏవీ అమ్ముడుపోలేదు. కిలో రూ.1,802/-గా ఉన్న నాలుగో రకం తలనీలాలను 9,800 కిలోలను వేలానికి ఉంచ‌గా, అన్నీ అమ్ముడు పోయాయి. తద్వారా రూ.176.60 ల‌క్ష‌ల‌ ఆదాయం లభించింది కిలో రూ.59/-గా ఉన్న ఐదో రకం తలనీలాలను 27,000 కిలోలను వేలానికి ఉంచ‌గా, 1,000 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.0.59 లక్షల ఆదాయం లభించింది.
6. శుభమస్తు
తేది : 6, సెప్టెంబర్ 2019
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : భాద్రపదమాసం
ఋతువు : వర్ష ఋతువు
కాలము : వర్షాకాలం
వారము : శుక్రవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : అష్టమి
(నిన్న రాత్రి 8 గం॥ 56 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 8 గం॥ 48 ని॥ వరకు)
నక్షత్రం : జ్యేష్ట
(ఈరోజు తెల్లవారుజాము 4 గం॥ 11 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 4 గం॥ 58 ని॥ వరకు)
యోగము : విష్కంభము
కరణం : భద్ర (విష్టి)
వర్జ్యం : (ఈరోజు ఉదయం 9 గం॥ 57 ని॥ నుంచి ఈరోజు ఉదయం 11 గం॥ 36 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు రాత్రి 7 గం॥ 52 ని॥ నుంచి ఈరోజు రాత్రి 9 గం॥ 31 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 8 గం॥ 30 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 19 ని॥ వరకు)(ఈరోజు ఉదయం 12 గం॥ 38 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 27 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 10 గం॥ 41 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 14 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 7 గం॥ 35 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 8 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 20 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 53 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 2 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 26 ని॥ లకు
సూర్యరాశి : సింహము
చంద్రరాశి : వృచ్చికము
7. చరిత్రలో ఈ రోజు/సెప్టెంబరు 6
1860 : ప్రముఖ సాంఘిక సేవిక, రచయిత జేన్ ఆడమ్స్ జననం.(మ.1935)
1906 : ప్రముఖ వైద్యురాలు,మాజీ పార్లమెంటు సభ్యురాలు కొమర్రాజు అచ్చమాంబ జననం (మ.1964).
1936 : తెలుగు కవి, సాహితీ విమర్శకుడు అద్దేపల్లి రామమోహనరావు జననం. (మ.2016)
1950 : సుప్రసిద్ధ అవధాని గండ్లూరి దత్తాత్రేయశర్మ జననం.
1966 : ఎ.జి.కె. గా ప్రసిద్ధిచెందిన హేతువాది ఆవుల గోపాలకృష్ణమూర్తి మరణం (జ.1917).
1968 : పాకిస్థాన్ క్రికెట్ క్రీడాకారుడు సయీద్ అన్వర్ జననం.
1996 : ఆంధ్ర, నాగార్జున విశ్వవిద్యాలయాలలో తెలుగు ఆచార్యుడు తూమాటి దోణప్ప మరణం (జ.1926).
2005 : ప్రఖ్యాత నేత్రవైద్య నిపుణుడు డాక్టర్ పెరుగు శివారెడ్డి మరణం.(జ.1920).
2012 : బుల్లితెర రచయిత మరియు నటుడు చెరుకూరి సుమన్ మరణం.(జ.1966)
2018 : తెలంగాణ అసెంబ్లీ రద్దు చేయబడింది.
8. తిరుమల \|/ సమాచారం
ఓం నమో వేంకటేశాయ!!
• ఈ రోజు శుక్రవారం,
06.09.2019
ఉదయం 6 గంటల
సమయానికి,
• తిరుమలలో భక్తుల రద్దీ
సాదారణం,
• స్వామివారి సర్వదర్శనం
కోసం తిరుమల వైకుంఠం
క్యూ కాంప్లెక్స్ లోని 07
గదులలో భక్తులు
చేచియున్నారు,
• ఈ సమయం శ్రీవారి
సర్వదర్శనానికి సుమారు
06 గంటలు పట్టవచ్చును
• నిన్న స్వామివారికి
హుండీలో భక్తులు
సమర్పించిన నగదు
₹: 2.87 కోట్లు,

• నిన్న 26,270 మంది
భక్తులు స్వామి వారికి
తలనీలాలు సమర్పించి
మొక్కులు తీర్చుకున్నారు
• నిన్న 66,622 మంది
భక్తుల కు కలియుగ దైవం
శ్రీ వేంకటేశ్వరస్వామి వారి
దర్శన భాగ్యం కల్గినది,
• శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
రెండు గంటల సమయం
పట్టవచ్చును,
వయోవృద్దులు మరియు దివ్యాంగుల
• ప్రత్యేయకంగా ఏర్పాటు
చేసిన కౌంటర్ ద్వారా
ఉ:10 గంటలకి (750)
మ: 2 గంటలకి (750)
ఇస్తారు,
చంటి పిల్లల తల్లిదండ్రులు మరియు ఎన్నారై ప్రత్యేక దర్శనాలు
• సుపథం మార్గం గుండా శ్రీవారి
దర్శనానికి అనుమతిస్తారు
ఉ: 11 గంటల నుంచి
సాయంత్రం 5 గంటల వరకు
దర్శనానికి అనుమతిస్తారు,
శ్రీవేంకటేశ్వర సుప్రభాతం
!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!
తా: కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నదికావున లెమ్ము స్వామి ttd Toll free #18004254141తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంకోసం క్రింద లింకు ద్వారా చేరండిhttps://t.me/joinchat/AAAAAEHgDpvZ6NI-F2C7SQ
9. 06 సెప్టెంబర్ 2019 శుక్రవారం రాశిఫలాలు
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : సంతానం వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. మానసిక చికాకులు అధికం అవుతాయి. ఏ పనిని శ్రద్ధతో పూర్తి చేయలేరు. ఆలోచనల్లో పరివర్తన చేసుకోవాలి. అనవసర ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. సృజనాత్మకత పెంచుకోవాలి. పనులలో నూతనోత్సాహం పెంచుకోవాలి. ఓం నమఃశ్శివాయ జపం మంచిది.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : గృహ సౌకర్యాలు సమకూరుతాయి. వాహనాలు సమయానికి లభిస్తాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. అనుకున్న పనులు మొండి తనంతో పూర్తిచేస్తారు. ఆహారం సమయానికి లభిస్తుంది. మృష్టాన్నభోజనంపై దృష్టి పెరుగుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : కమ్యూనికేషన్స్‌ వల్ల ఒత్తిడి పెరుగుతుంది. విస్తరణ, సేవా విభాగాల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనుకున్న పనులు పూర్తి చేయడంలో శ్రమ అధికం అవుతుంది. వ్యాపారస్తులు కొంత జాగరూకులై ఉండడం మంచిది
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : వాక్‌ చాతుర్యం పెరచుకునే ప్రయత్నం చేస్తారు. మధ్యవర్తిత్వాలు లాభిస్తాయి. నిల్వ ధనం పెంచుకునే ఆలోచన చేస్తారు. లాభాలు అన్నీ కలిసి వస్తాయి. ఆభరణాలు మొదలైనవి సమకూర్చు కునే ప్రయత్నం చేస్తారు. పండుగ వాతావరణం ఏర్పడుతుంది. లక్ష్మీ అష్టోత్తర పారాయణం మేలు చేస్తుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : శారీరక శ్రమ అధికం అవుతుంది. అనుకున్న పనులు పూర్తి చేయడంలో అడ్డంకులు ఏర్పడతాయి. పని పూర్తిచేయడంలో పట్టుదల అవసరం. కార్యనిర్వహణ శక్తి అధికం అవుతుంది. శ్రమకు తగిన ఫలితం రాకపోవచ్చు. ఊహించని చికాకులు, పాదాల నొప్పులు, అనవసర ఒత్తిడి ఏర్పడుతుంది.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఊహించని ఇబ్బందులు వస్తాయి. పనులలో ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనవసర ప్రయాణాలు పెరుగుతాయి. అన్ని రకాల విహారాలు యాత్రలు చేస్తారు. విశ్రాంతిలోపం ఏర్పడుతుంది. విశ్రాంతికై ప్రయత్నం అవసరం. శ్రీమాత్రేనమః జపం మంచిది.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : లాభాలు సద్వినియోగం అవుతాయి. అన్ని రకాల ఆదాయాలు వస్తాయి. దురాశ పెరుగుతుంది. కళాకారులకు అనుకూలమైన సమయం. సమిష్టి ఆశయాలు నెరవేరుతాయి. ఆదర్శవంతమైన జీవితం ఏర్పడుతుంది. ఇతరులపై ఆధారపడతారు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : కీర్తి ప్రతిష్టలకై ఆలోచన పెరుగుతుంది. శారీరక బలం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. వృత్తి వ్యాపార విషయాల్లో చొరవ చూపిస్తారు. ఇతరులపై ఆధారపడతారు. పెద్దలంటే గౌరవం పెరుగుతుంది. అధికారులతో అనుకూలత పెరుగుతుంది. సంఘంలో గౌరవం పెంచుకునే ప్రయత్నం.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : పరిశోధకులకు అధిక ఒత్తిడి ఏర్పడుతుంది. తీర్థయాత్రలు చేయాలనే సంకల్పం పెరుగుతుంది. పెద్దలంటే గౌరవ మర్యాదలు ఏర్పడతాయి. పరాక్రమం పెరచుకుంటారు. సజ్జన సాంగత్యం ఏర్పడతాయి. తపస్సు చేయాలనే ఆలోచన పెరుగుతుంది. సంతృప్తి లోపం పెరుగుతుంది.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : శ్రమలేని ఆదాయంపై దృష్టి పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. లాభనష్టాలు సరిసమానంగా చూసుకుంటారు. క్రయ విక్రయాలు అధికం అవుతాయి. ఇతరులపై ఆధారపడతారు. అనారోగ్య సూచనలు ఉన్నాయి. చెడు మార్గాల ద్వారా ఆదాయ సంపాదన.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : సామాజిక అనుబంధాలు విస్తరిస్తాయి. విదేశీ వ్యవహారాలు లాభిస్తాయి. నష్టవస్తు పరిజ్ఞానం పెరుగుతుంది. విరోధులను మిత్రులుగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు. భాగస్వాములకు అనుకూలమైన సమయం. పదిమందిలో గౌరవం పెరుగుతుంది. శ్రీ మాత్రేనమః జపం మంచిది.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : పోటీల్లో గెలుపుకై ప్రయత్నం చేస్తారు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. అనారోగ్యం దరిదాపుల్లోకి చేరదు. శత్రువులపై విజయం సాధిస్తారు. అప్పులు తీరుతాయి. శత్రువులు పెరుగుతారు. జాగ్రత్త అవసరం.
10.చిన్న వెంకన్న హుండీల ఆదాయం రూ.2.46కోట్లు
ప్రముఖ పుణ్య క్షెత్రమ్ ద్వారకాతిరుమల శ్రీవెంకటేశ్వర స్వామీ ఆలయ హుండీల ఆదాయాన్ని గురువారం లెక్కించరు. 36రోజులకు రూ. 2,46,38,032 నగదు దాదాపు తొమ్మిది కేజీల వెండి, 447 గ్రాముల బంగారం లభించాయని ఈవో పెద్దిరాజు తెలిపారు.
11. రూపం భిన్నం సందేశం వినూత్నం
బహురూప కారుడైన గణనాధుని పూజించడంలో ప్రకృతి ఆరాధన ప్రస్పుటం అవుతోంది.పర్యావరణానికి హానీ కలగని రీతిలో భిన్నా ఆకృతుల్లో భిన్న వస్తువులతో వినాయకుడిని పూజిస్తూ ప్రజలు తను భక్తిని చాటుకుంటున్నారు. కడపలో వంద కిలోల అరిసెలు, సామలు, కొర్రలు, రాగులు, జొన్నలు ఉలవలతో రూపొందించిన పన్నెండు అడుగుల వినాయకుడి విగ్రహమిది.
12.దుర్గమ్మ దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు
దసరా ఉత్సవాలు 29 -9- 2019 నుండి 8-10-2019 వరకు జరుగుతాయి.దీనికి సంబంధించి అన్ని ఏర్పాటు పూర్తిస్థాయిలో చేశాం.మొదటిరోజు స్నపనాభిషేకం అనంతరం ఉదయం 9 గంటలకు దర్శనం ప్రారంభించబడును.మిగతా రోజుల్లో ఉదయం 3 గం నుండి రాత్రి 11 వరకు వరకు దర్శనం ఉంటుంది.మూల నక్షత్రం రోజు ఉదయం రెండు గంటల నుండి రాత్రి 11 గంటల వరకు దర్శనం ఉంటుంది..దుర్గ గుడికి వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా క్యూలైన్లను ఏర్పాటు చేయడం జరిగింది..కొండ కింద ఉ వినాయకుడి దగ్గర నుండి క్యూ లైన్ ఏర్పాటు చేశాము..అని క్యూ లైన్లో వాటర్ ప్యాకెట్ షామియానా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయడం జరిగింది..భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది..ముఖ్యమైన ప్రదేశాలు నుంచి మైకు ప్రచార కేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది..భక్తుల భద్రత దృశ్సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం.జిల్లా కలెక్టర్ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయడం జరిగింది.వృద్దులు మరియు దివ్యాంగులకు ప్రత్యేక వాహనాలు వైపుకు రాజీవ్ గాంధీ పార్కు వద్ద ఉచిత బస్సులు ఏర్పాటు చేయటం రైల్వే స్టేషన్ వద్ద దేవాలయం సంబంధించిన బస్సు ఏర్పాటు చేయడం జరిగింది..ఉచిత ప్రసాదం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసాము.