తమిళ తంబీలు అమ్మగా, పురుచ్చతలైవీగా పిలుచుకొనే జయలలిత కొద్ది రోజుల క్రితం అనారోగ్య సమస్యలతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆమె జీవితంలో ఎన్నో అద్భుత ఘట్టాలు ఉన్నాయి. వాటిని వెండితెరపై చూపించేందుకు పలువురు దర్శకులు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేతి రెడ్డి జగదీశ్వర్ రెడ్డి ‘శశి లలిత’ పేరిట బయోపిక్ చేస్తున్నాడు. అలానే తమిళ దర్శకురాలు ప్రియదర్శిని ‘ది ఐరన్ లేడీ’ పేరుతో జయలలిత బయోపిక్ రూపొందిస్తుంది. తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ .. తలైవీ అనే టైటిల్‌తో జయలలిత బయోపిక్‌ని తెరకెక్కిస్తుండగా, ఇందులో కంగనా ప్రధాన పాత్ర పోషిస్తుంది.ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ జయలలిత జీవితంపై కల్పిత వెబ్ సిరీస్ చేసేందుకు సిద్ధమయినట్టు ఇటీవల వార్తలు వచ్చిన విషయం విదితమే. తాజాగా దీనికి సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. క్వీన్ అనే టైటిల్‌తో వెబ్ సిరీస్ రూపొందనుండగా, ఇందులో రమ్య కృష్ణన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.MX ప్లేయర్‌లో ఈ సిరీస్ ప్రసారం కానుంది. తెలుగు, హిందీతో పాటు పలు భాషలలో ఈ వెబ్ సిరీస్‌ని మనం వీక్షించవచ్చు. మేకర్స్ తాజాగా విడుదల చేసిన లుక్‌లో రమ్యకృష్ణ జెండా అంచు కలిగిన తెల్ల చీర ధరించి , వేదికపై నిలబడి ప్రజలనుద్దేశించి మాట్లాడుతుంది . త్వరలోనే ఈ వెబ్ సిరీస్ విడుదల తేదీని ప్రకటించనున్నారు.1960 మధ్య కాలంలో టాప్ హీరోయిన్‌గా అలరించిన అందాల నటి జయలలిత తెలుగు, తమిళం, కన్నడ,భాషలలో దాదాపు 140కి పైగా సినిమాలు చేసింది . భారత రాజకీయాలలోను ముఖ్య భూమిక పోషించిన జయలలిత దాదాపు 14 సంవత్సరాలకి పైగా తమిళనాడు ముఖ్యమంత్రి బాధ్యతలని నిర్వర్తించింది.
అమ్మ వచ్చేస్తంది
Related tags :