‘నాతో ఏదైనా చెప్పాలంటే మాట్లాడకండి.. సైగ చేయండి’ అంటున్నారు కథానాయిక శ్రియ. అలా సైగ చేస్తే విషయాన్ని త్వరగా అర్థం చేసుకుంటానని చెబుతున్నారట. కానీ, ఇదంతా వెండితెరపై మాత్రమే. నిజ జీవితంలో కాదు. తన తాజా చిత్రంలో శ్రియ వినికిడి లోపం ఉన్న పాత్రను చేయనున్నారని సమాచారం.ఈ సినిమాతో సృజన అనే కొత్త డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. ఈ చిత్రంలో బోలెడంత ఎమోషనల్ కంటెంట్ ఉంటుందని టాక్. కథ ముఖ్యంగా శ్రియ పాత్ర చుట్టే తిరుగుతుందని తెలిసింది. శ్రియ ఇండస్ట్రీకి వచ్చి పదిహేనేళ్లు పైనే అయింది. ఇన్నేళ్ల జర్నీలో చేయనటువంటి చాలెంజింగ్ రోల్ ఇది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో కొన్ని కీలక పాత్రలు ఉంటాయట. ప్రతి పాత్రకూ ఓ సొంత కథ ఉంటుందని సమాచారం.
సైగ చేయండి
Related tags :