ప్రవాస చిన్నారుల పాలిట తెలుగు కల్పవల్లి సిలికానాంధ్ర మనబడి 2019-20 విద్యా సంవత్సరం శనివారం నుండి ప్రారంభమయింది. అమెరికావ్యాప్తంగా 10వేల మందికి పైగా ప్రవాస చిన్నారులు, బాలబాలికలు ఈ తరగతుల్లో తెలుగు భాషా మాధుర్యాన్ని ఔపోసన పట్టనున్నారు. ప్రపంచవ్యాప్తంగా సిలికానాంధ్ర మనబడిలో ప్రస్తుతం 50వేలకు పైగా విద్యార్థులు తెలుగు భాషను అభ్యసిస్తున్నారు. నూతన విద్యాసంవత్సరంలోకి ప్రవేశించిన విద్యార్థినీ విద్యార్థులకు మనబడి నిర్వాహకులు కూచిభొట్ల ఆనంద్, చమర్తి రాజు, కొండుభట్ల దీనబాబు తదితరులు స్వాగతం పలికారు. రిజిస్ట్రేషన్ల ఆఖరు తేదీ సెప్టెంబరు 20. మరిన్ని వివరాలకు manabadi.siliconandhra.org వెబ్‌సైట్‌ను చూడవచ్చు.
2019-20 మనబడి తరగతులు ప్రారంభం
Related tags :