1.మలేరియా గుట్టు రట్టు
ఏటా ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల మంది మలేరియా బారిన పడుతున్నారు! మలేరియాకు మందు ఉన్నా కూడా.. దాదాపు 5 లక్షల మంది దానివల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంత మంది ప్రాణాలు తీస్తున్న ఆ మహమ్మారి పరాన్నజీవి తాలూకూ పూర్తివివరాలను (మలేరియా సెల్ అట్లాస్) బ్రిటన్కు చెందిన వెల్కమ్ సేంజర్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు రూపొందించారు. దీని ఆధారంగా భవిష్యత్తులో మలేరియాను సమర్థంగా నిరోధించే టీకాలు, మలేరియాను తగ్గించే మందులను తయారుచేయవచ్చని వారు వివరించారు.
2.జీవనశైలి వ్యాధులు దరిచేరకూడదంటే.
ఏటా సెప్టెంబర్ నెలను ‘జాతీయ పోషకాహార నెల’గా జరుపుకుంటారు. దీని ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఆహారం, ఆరోగ్యంపైన అవగాహన కలిగించడం. ఈ సందర్భంగా ‘మెటబాలిక్ సిండ్రోమ్’ గురించి తెలుసుకుందాం!
ప్రస్తుత జీవనవిధానం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ సిండ్రోమ్ను ‘సిండ్రోమ్ ఎక్స్’ అని కూడా పిలుస్తారు. ఈ సిండ్రోమ్ లైఫ్స్టయిల్ డిసీజ్లకు కారణమవుతుంది.ఫాస్టింగ్ షుగర్ 100ఎంజీ కన్నా ఎక్కువ ఉండడంలిపిడ్ ప్రొఫైల్లో హెచ్డిఎల్ అంటే మంచి కొలెస్ట్రాల్ 40ఎంజి కన్నా తక్కువ ఉండడం, అలాగే ట్రైగ్లిజరైడ్స్ 150 కన్నా ఎక్కువ ఉండడం.రక్తపోటు 130/85 కన్నా ఎక్కువ ఉండడం.పొట్ట భాగంలో కొవ్వు అధికంగా ఉండడం.వ్యాయామం కొరవడడం.నిద్ర సరిగ్గా లేకపోవడం… ఇవన్నీ సిండ్రోమ్…. రావడానికి సహకరిస్తాయి. వీటిలో ఏ మూడు లక్షణాలు ఉన్నా రిస్క్ ఎక్కువ ఉన్నట్టే.
****పాటించాల్సిన జాగ్రత్తలు
ప్రతి ఒక్కరు మూడు సూత్రాలు పాటించాలి. ఇవి ప్రివెంటివ్గా పనిచేస్తాయి.పంచదార అతి తక్కువగా వాడటం లేదా మానేయడం. టీలోనే కాకుండా, స్వీట్స్, కేకులు, ఇతర పదార్థాలలో చక్కెర బాగా తగ్గించాలి. రోజుకు 10 గ్రాములకు మించి తీసుకోకూడదు.ఉప్పు అతిగా తీసుకోవడం తగ్గించాలి. నిల్వ ఉన్న ఆహారపదార్థాల్లో ఉప్పు ఎక్కువ. కాబట్టి వాటిని తగ్గించాలి. తాజా ఆహారం మాత్రమే తినాలి. రోజుకు 5గ్రాములకు మించి ఉప్పు తీసుకోకూడదు.నూనె రోజుకు 30 గ్రాములకు మించకుండా కొవ్వు పదార్థాలు ఉండాలి. కనిపించని కొవ్వు పదార్థాలు బయట ఆహారంలో, బేకరీ ఫుడ్లో అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ట్రాన్స్ఫ్యాట్స్ ఆరోగ్యానికి హాని చేస్తాయి. హైడ్రోజినేటెడ్ ఫ్యాట్స్, బేకరీ ఫుడ్స్లో ట్రాన్స్ఫ్యాట్స్ ఉంటాయి.ఆహారంలో చిన్న చిన్నమార్పులు చేసుకోవడం ద్వారా అనారోగ్యాలను దరిచేరకుండా చూసుకోవచ్చు.
ఏ ఆహారం అధికంగా తీసుకోరాదు. సమతుల ఆహారం తీసుకోవాలి.పండ్లు, కూరగాయల్లో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. వీటిని ప్రతిరోజు తీసుకోవాలి. వీటితో పాటు సీడ్స్, నట్స్… మెనూలో ఉండేలా చూసుకోవాలి.సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత వ్యాయామం చేయడం తప్పనిసరి.
3.ఏ సమయానికి ఎంత నీరు?
మనం ఉదయం తాగిన నీరు 11 గంటల వరకూ శరీర అవసరాలను తీర్చడానికి సరిపోతుంది. ఆ సమయం నుంచి శరీరానికి నీటి అవసరం మళ్లీ ఉంటుంది. పగలు తాగిన నీరు శరీరాన్ని శుభ్రపర్చడానికి పనికిరాదు కానీ, శరీరాన్ని ఎండ నుంచి కాపాడుకోవటానికి, పని చేసినపుడు కండరాల్లో పుట్టే వేడిని చల్లార్చడానికి, జీర్ణాది రసాల ఉత్పత్తికి సహకరిస్తుంది. పగటిపూట మనం రెండున్నర లీటర్ల నీరు తాగితే మంచిది. ఈ నీటిని ఎప్పుడు పడితే అప్పుడు, తినేటప్పుడు కాకుండా ఒక పద్ధతి ప్రకారం తాగితే మంచిది. రెండవ దఫా నీటిని తాగిన తర్వాత 25-30 నిమిషాలు గ్యాప్ ఇచ్చి ఏదన్నా టిఫిన్ తినొచ్చు లేదా తాగవచ్చు. టిఫిన్ తినేటప్పుడు నీరు తాగొద్దు. టిఫిన్ తిన్న రెండు గంటల తర్వాత నీటిని ఒకేసారి తాగకూడదు. అలా తాగితే బరువుగా, ఆయాసంగా ఉంటుంది. ఈ నీటిని రెండు, మూడు దఫాలుగా అప్పుడొక గ్లాసు, అప్పుడొక గ్లాసు చొప్పున నీటిని తాగాలి. మధ్యాహ్నం భోజనానికి అరగంట ముందు వరకూ నీరు తాగి ఆపి వేయాలి. ఇక భోజన సమయంలో మంచినీరు తాగొద్దు. మాత్రలు మింగడానికి గానీ, గొంతు బాగా పట్టినపుడు గానీ ఒక గుక్కెడు నీరు తాగవచ్చు. నాల్గవ దఫా నీరు మధ్యాహ్నం భోజనం అయిన రెండు గంటల తర్వాత నుంచి 2-3 అంచెలుగా లీటరు నుంచి లీటరంపావు వరకూ నీటిని తాగవచ్చు. ఇలా తాగిన నీరు జీర్ణమైన ఆహారాన్ని పేగులు పీల్చుకోవటానికి సహకరిస్తుంది. 55-60 సంవత్సరాలు పైబడిన వారు సాయంకాలం 4-5 గంటలు దాటిన తర్వాత నీరు తాగకుండా ఉంటే రాత్రి వేళల్లో మూత్ర సమస్య ఉండదు. ఇక ఐదవ దఫా నీరు అందరికీ అవసరం లేదు. ఎవరైతే నాల్గవ దఫాలో నీరు తక్కువ తాగారో వారికి, బాగా ఎండలో చెమటలు పట్టేలా పనిచేసిన వారికి, యుక్త వయసులో ఉన్న వారికి మంచిది. రాత్రిపూట నీటిని తాగనవసరం లేదు. ఎవరికన్నా రాత్రి 9-10 గంటలకు దాహం అనిపిస్తే అరగ్లాసు లేదా గ్లాసు నీరు తాగి పడుకోవచ్చు. ఈ సూచనలు శరీరానికి కావాల్సిన కనీస నీటి అవసరాన్ని తెలిపేవి మాత్రమే.
4. ఉల్లికాడలలో ఆరోగ్య ప్రయోజనాలు
ఉల్లికాడలు గుండె, రక్తనాళాలకు మంచిది. ఇది కొలెస్ట్రాల్ ఆక్సీకరణను తగ్గిస్తుంది, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బ్లడ్ ప్రెజర్ ని మెరుగుపరుస్తుంది : ఈ కూరగాయలోని సల్ఫర్ కాంపౌండ్ బ్లడ్ ప్రెజర్ స్థాయిలను నియంత్రించడానికి, తగ్గించడానికి సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు : ఉల్లికాడలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి కూడా సహాయపడతాయి. మధుమేహం : ఉల్లికాడలలో ఉన్న క్రోమియం కంటెంట్ మధుమేహ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇది బ్లడ్ షుగర్ స్థాయిలను నియంత్రిస్తుంది, గ్లూకోస్ శక్తిని పెంచుతుంది. జలుబు, జ్వరం : దీనిలో ఉన్న యాంటీ-బాక్టీరియల్ లక్షణం జలుబు, జ్వరానికి వ్యతిరేకంగా పోరాడడానికి సహాయ పడుతుంది. అరుగుదల పెరుగుతుంది : అసౌకర్య అరుగుదల నుండి ఉపశమనానికి యాంటి బాక్టీరియల్ లక్షణాలను కూడా అందిస్తుంది. వ్యాధినిరోధక శక్తి : ఈ కూరగాయలోని విటమిన్ సి వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. జీవక్రియ : స్ధూలపోషకాలు ఉండడం వల్ల ఇది జీవక్రియ నియంత్రణకు మంచి ఆహారం. కళ్ళు : ఉల్లికాడలు కళ్ళ జబ్బులకు, కాళ్ళ సమస్యలకు మంచివి.ముడతలను తొలగిస్తుంది: ఇవి చర్మానికి మంచిది, ఇది చర్మం ముడతలు పడకుండా రక్షిస్తుంది.
5. ఆవిరితో ఉడికిస్తే ఆరోగ్యం
తేలికగా, ఆవిరి మీద ఉడికించిన ఆహార వినియోగం ఇటీవల కాలంలో ఎక్కువయ్యింది. నేరుగా నీటిలో ఉడికించిన, నూనెలో వేయించిన పదార్ధాలతో పోల్చినప్పుడు ఆవిరి మీద వండిన పదార్థాలలోని పోషకాలు చెదరకుండా నిలిచి ఉండటమే ఇందుకు కారణం. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం మీద పెరిగిన అవగాహనే ఈ మార్పుకు మరో కారణం. – నిజానికి ఆవిరి మీద వండటమనే పద్ధతి వందలాది ఏళ్లుగా భారతదేశంతో సహా పలు దేశాల్లో వాడుకలో ఉన్నదే. నీటిలో ఉడికించటం, నూనెలో వేయించటం కంటే ఆవిరి మీద వండుకోవటం చాలా సులభం. వేగంగా వంట పూర్తవటమేగాక చౌక కూడా. – ఏ పదార్థాన్ని ఎంత ఆవిరిలో ఎంత సమయం ఉడికించాలనేది తెలిస్తే వాటిలోని సహజ పోషకాలను కోల్పోకుండా చూడొచ్చు. ఆవిరి వంట వల్ల కూరగాయల సహజరూపం, రంగు, సువాసన, అందులోని పీచు యథాతథంగా అందుతుంది. అంతేగాక ఆ పదార్థాల్లో ఉండే నీటిలో కరిగే విటమిన్లు కూడ చెదరిపోవు. ఆవిరి మీద వండిన ఆహారంలో వేపుళ్ల మాదిరిగా అదనపు క్రొవ్వు వంటివి లేకపోగా కేలరీలు తక్కువే గనుక ఊబకాయులకు, బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి ప్రత్యామ్నయం. – కూరగాయల్లో ఉండే బి, సి విటమిన్లు నీటిలో సులభంగా కరిగిపోతాయి. కాబట్టి వీటిని నీటిలో వండే బదులు ఆవిరి మీద ఉడికిస్తే ఆ సమస్య ఉండదు. అంతేగాక కూరగాయల్లోని విటమిన్లతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా శరీరానికి అందుతాయి. దీనివల్ల శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి వ్యవస్థ మెరుగుపడుతుంది. – క్యాబేజీ, బ్రకోలి, కాలిఫ్లవర్ వంటి కూరగాయల్లో లభించే పోషకాలకు క్యాన్సర్ తో సహా పలు ప్రమాదకరమైన కణితులను నివారించే శక్తి ఉంది. అయితే వాటిని ఆవిరి మీద ఉడికించినప్పుడే ఆ పోషకాలు పూర్తిగా శరీరానికి అందుతాయి. ఆవిరి మీద ఉడికిస్తే కూరగాయలు గుజ్జుగానో, నీరునీరుగా కాకుండా కోసినప్పటిలాగానే ఉంటాయి. ఆవిరి వంటకాలు తేలిగ్గా జీర్ణమవటమే గాక అందులోని పోషకాలను శరీరం సులభంగా గ్రహించుకోగలుగుతుంది. దీనివల్ల కడుపుబ్బరం, తేన్పులు, మలబద్ధకం వంటి ఇబ్బందులు దూరమవుతాయి.
TNI ఆరోగ్య చిట్కాలు
Related tags :