Politics

లోకేశ్‌పై పరోక్షంగా విజయసాయి సెటైర్లు

Vijayasai Reddys Humor On Chandrababu And Kid Makes You Giggle

టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి ఫైర్ అయ్యారు వైసీపీ నేత విజయసాయిరెడ్డి. శనివారం ట్విట్టర్ వేదికగా ఆయన చంద్రబాబుపై తనదైన స్టైల్లో ట్వీట్ చేశారు. “5 వేల వేతనంతో పనిచేసే గ్రామ వాలంటీర్లకు పిల్లను కూడా ఇవ్వరని చంద్రబాబు ఎకసెక్కాలాడుతున్నారు. అప్రయోజకుడు, అజ్ఞాని, చెల్లని కాసులాంటి మాలోకానికి పెళ్లి అవలేదా? లక్షల మందితో పోటీపడి ఉద్యోగాలు సాధించిన వాలంటీర్లు…..సైనికులకు ఏం తక్కువని మీరలా అపశకునాలు పలుకుతున్నారు?” అని చంద్రబాబును ఉద్దేశించి ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి.