* వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ ప్రభుత్వం వంద రోజుల్లోనే అన్ని రంగాల్లో విఫలం చెందిందంటూ తెలుగుదేశం పార్టీ పుస్తకం ప్రచురిస్తోంది. గతంలో టీడీపీ ప్రభుత్వంపై వామపక్షాలు, కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించిన విధానాన్నే తాజాగా టీడీపీ అమల్లోకి తెస్తోంది. అమరావతిలో అక్రమ నిర్మాణం అంటూ కూల్చివేసిన ప్రజావేదిక సంఘటన నుంచి రాజధాని పనుల నిలిపివేత, రివర్స్ టెండరింగ్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న దాడుల వరకు పలు అంశాలను ఈ పుస్తకంలో పొందుపరిచినట్లు సమాచారం. పార్టీ సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు ఈ పుస్తకాన్ని త్వరలో అమరావతిలోని పార్టీ కార్యాలయంలో విడుదల చేయనున్నారు.
* సుదీర్ఘ కాలం పాటు గవర్నర్‌గా సేవలందించిన నరసింహన్‌కు సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సంప్రదాయం ప్రకారం కేసీఆర్ దంపతులు తిలకాన్ని దిద్ది, పూలమాల, శాలువాలతో సత్కరించి, వీణను బహూకరించారు. అయితే ఈ సమయంలో కేసీఆర్ తీవ్ర ఉద్విగ్నానికి లోనయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ కేసీఆర్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మొదట్లో కేసీఆర్ ఆయన్ను కలవడానికి 12 గంటలకు వచ్చారని, ఆ సమావేశం దాదాపు మూడు గంటల పాటు సుదీర్ఘంగా కొనసాగిందని తెలిపారు. అయితే తనకు ఒంటి గంటకు లంచ్ చేయడం అలవాటని, కేసీఆర్ మాత్రం దాదాపు మూడు గంటల పాటు సమావేశాన్ని కొనసాగించేవారని అన్నారు.
* జగన్ ప్రభుత్వ వంద రోజుల పాలనపై టీడీపీ చార్జిషీటు విడుదల చేయనుంది. గుంటూరులోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు, పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు శనివారం దీనిని విడుదల చేస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. వంద రోజుల్లో ప్రభుత్వ వైఫల్యాలు, వ్యవస్థల పతనం, రివర్స్ పాలన, అరాచకాలను ఎత్తి చూపుతూ ఈ చార్జిషీటును రూపొందించినట్లు సమాచారం.
* చింతమనేని కేసులకు సంబంధించి ఎస్సై క్రాంతిప్రియ సస్పెండ్ అయ్యారు. పోలవరం కడికాల్వ గట్టు నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్న కేసు నుంచి చింతమనేని పేరును క్రాంతి ప్రియ తప్పించారు. ఆ కేసులో అప్పటి పెదవేగి ఎస్సైగా పని చేసిన క్రాంతిప్రియ సక్రమంగా విచారణ చేయలేదని అధికారులు గుర్తించారు.
* సోపోర్ జిల్లా దంగెర్‌పొరా ప్రాంతంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో చిన్నారి సహా నలుగురు పౌరులు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితుల పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉంది.
*శుక్రవారం నాటి బులియన్ మార్కెట్లో భారీగా పెరుగుతున్న బండారం ధరలకు అడుకట్ట పడింది. ఆభరణాల తయారీ దారుల నుంచి బంగారానికి డిమాండ్ తగ్గడం, రూపాయి బలపడటం బంగారం రేటు తగగ్దానికి కారణమైందని హెచ్ డీ ఎఫ్ సి సెక్యురిటీ సీనియర్ విశ్లేషకుడు తపన్ పటేల్ అన్నారు. బంగారంలో పెతుబడులు బలహీనంగా మారడాన్ని కూడా మరో కారణంగా చెబుతున్నారు.
* ముంబైలో అత్యంత ప్రసిద్ధ పొందిన సబర్బన్ విలేపార్లే వినాయకుడ్ని ప్రధాని మోదీ శనివారం దర్శించుకున్నారు. విమానాశ్రయంచి నేరుగా ఇక్కడి మంటపానికే చేరుకున్నారు. వినాయకుడి దర్శనానికి వచ్చిన ప్రధానికి లోకమాన్య సేవాసంఘ్ ఘన స్వాగతం పలికింది. ఈ సందర్భంగా మోదీ వినాయకుడికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అక్కడి విజిటర్స్ బుక్ లో మోదీ తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ…‘‘స్వరాజ్యం నా జన్మహక్కు’ అని అన్న తిలక్ నినాదాన్ని మీ జీవిత మంత్రంగా చేసుకున్నందుకు మీరు అభినందనీయులు. అందుకు మీరు అర్హులు కూడా. స్వరాజ్యం నా జన్మహక్కు. ప్రస్తుత భారత దేశంలో ‘సురాజ్య’ మంత్రం కర్తవ్యం లాంటిది. ప్రతీ ఒక్కరి హృదయం లోంచి వచ్చే ఈ మంత్రం ప్రతీ ఒక్కరికీ స్ఫూర్తినివ్వాలి. అదే నా ఆశయం’’ అని ప్రధాని మోదీ తన భావాలను ‘విజిటర్స్ బుక్’ లో రాశారు.లోకమాన్య బాల గంగాధర్ తిలక్ ప్రోత్సాహంతో ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశ్యంతో 1923 లో ‘లోకమాన్య సేవా సంఘ్’ అన్న సంఘాన్ని స్థాపించారు. ఇక్కడే గణేశ్ నవరాత్రులు అత్యంత వైభవంగా జరుపుతారు.
* మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వీకే తహిల్మ్రణి తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు పంపారు. మేఘాలయ హైకోర్టుకు తనను బదిలీ చేయాలని కోరగా.. ఆమె వినతిని మూడు రోజుల తర్వాత సుప్రీంకోర్టు కొలిజీయం తిరస్కరించింది. దీంతో ఆమె తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
* గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలో ప్రధాన రహదారులపై గతంలో పోలీసుల అధికారులు ఏర్పాటు చేసిన సి సి కెమెరాలు ప్రస్తుతం పని చేయకపోవడంతో అసాంఘిక కార్యక్రమాలు నేరాలు పోలీసులు గుర్తించ లేక పోతున్నారు,
* నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరు పాలెం లో వ్యవసాయ శాఖ అధికారుల బృందం జెడిఎ శివన్నారాయణ,ఎడిఎ మారుతీ దేవి ,ఎఆర్ఎస్ వినీత, ముత్తుకూరు మండల వ్యవసాయ శాఖ అధికారి హరి కరుణాకర్ రెడ్డి, నెల్లూరు జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఇఇ ప్రమోద్ కుమార్ రెడ్డి ల పర్యటించారు.
* ప్రాజెక్టులకు వరద ఉధృతి కొనసాగుతోంది. శనివారం సుంకేసులకు వరద ఉధృతి కొనసాగుతోంది. సుంకేసులు 15 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు. శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటిమట్టం 885 కాగా, ప్రస్తుతం 879.90 అడుగులకు చేరింది. తూర్పు గోదావరి లో గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది.
* చంద్రయాన్ 2 ప్రయోగంలో కేవలం 5 శాతమే విఫలమైందని ఇస్రో ప్రకటించింది. చంద్రుడిపై దిగవలసిన విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్‌లనుంచి సంకేతాలు రాకపోవడం వల్ల తమ ప్రయోగం కేవలం 5 శాతం మాత్రమే విఫలమైందని ఇస్రో పేర్కొంది. చంద్రయాన్ 2 ఆర్బిటార్ చంద్రుడి కక్ష్యలో తిరుగుతూనే ఉందని, దూరంనుంచి అది చంద్రుడిని అధ్యయనం చేసి అవసరమైన సమాచారం అందిస్తుందని ఇస్రో తెలిపింది. ఆర్బిటార్ చంద్రుడి ఫొటోలను తీసి పంపగలుగుతుందని ఇస్రోకు చెందిన ఒక శాస్త్రవేత్త చెప్పారు. లాండర్‌లోని రోవర్ జీవిత కాలం 14 రోజులు మాత్రమేనని, ఆర్బిటాల్ జీవిత కాలం ఒక ఏడాది అని ఆ శాస్త్రవేత్త అన్నారు.
* జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్‌యు) విద్యార్థి సంఘం ఎన్నికల ఫలితాలను ఈ నెల 17వ తేదీ వరకూ ప్రకటించవద్దని ఢిల్లి హైకోర్టు జెఎన్‌యును ఆదేశించింది. జెఎన్‌యు విద్యార్థి సంఘం ఎన్నికల ఫలితాలను ఈ నెల 8వ తేదీ ఆదివారం ప్రకటించాల్సి ఉండగా, హైకోర్టు దానికి బ్రేక్ వేసింది. జెన్‌యులో కౌన్సెలర్ పోస్టుల సంఖ్యను 55నుంచి 46కు తగ్గించాలని యూనివర్శిటీ తీసుకున్న నిర్ణయంపై పలు పిటిషన్లను హైకోర్టు విచారిస్తున్నది. ఈ కేసు తదుపరి విచారణ ఈ నెల 17వ తేదీన జరుగనున్నది. ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘం ఫలితాలను ఆ రోజు వరకూ ప్రకటించవద్దని హైకోర్టు ఆదేశించింది. జెన్‌యు విద్యార్థి సంఘం ఎన్నికల్లో అధ్యక్ష పదవికి ఆరుగరు అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
* ఆంధ్రప్రదేశ్ లో తాజా రాజకీయ పరిస్థితులపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ సాంగ్ ను ఆర్జీవీ విడుదల చేశారు. ఈ సినిమా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పాత్రధారులను కూడా చూఛాయగా చూపించారు. ఈ క్రమంలో తాజాగా ఈ రోజు సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ వర్మ విడుదల చేశారు.
* ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా టెండర్లు ఉంటే అది ఎలా రద్దు చేస్తారు. అధికారులను ప్రశ్నించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 10 రోజులు సమయం ఇవ్వండి ఈ సమస్యకు పరిష్కారం చూపుతాం. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి హామీ ఇచ్చిన అధికారులు.
* ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించే పోలీసులకు భారీ జరిమానా తప్పదని హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ (ట్రాఫిక్) ఎస్. అనిల్ కుమార్ హెచ్చరికలు జారీచేశారు. ఈ మేరకు ఆయన అంతర్గత ఉత్వర్వలు జారీ చేశారు.
* పాక్ ఉగ్రవాదులు భారతవైమానిక కేంద్రాలపై పఠాన్కోట్ తరహా దాడులకు దిగే అవకాశముందని కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాలు అందించిన సమాచారంతో భారత వాయుసేన దళాలను అప్రమత్తం చేసినట్లు ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా వెల్లడించారు.
* కొత్త మోటారు వాహనాల సవరణ చట్టం 2019 ప్రకారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే వారికి రెట్టింపు జరిమానా విధిస్తామని ఆ రాష్ట్ర డీజీపీ ఓపీ సింగ్ తాజాగా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.మోటారు వాహనాల సవరణ చట్టం 2019 సెక్షన్ 210 బి ప్రకారం పోలీసులు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించి వాహనాలు నడిపితే వారికి డబుల్ జరిమానాలు విధిస్తామని డీజీపీ విడుదల చేసిన ఆదేశాల్లో పేర్కొన్నారు. డ్రైవింగ్ తప్పిదాలపై భారీ జరిమానాలు విధిస్తామని డీజీపీ చెప్పారు. ఈ నెల 1వతేదీ నుంచి భారీ జరిమానాల వడ్డన ప్రారంభించామని డీజీపీ వివరించారు.
* ఇప్పుడు ఎక్కడ చూసినా ట్రాఫిక్ చలానాలు, ఫైన్లు, కొత్త ట్రాఫిక్ రూల్స్ కు సంబంధించిన అంశాలే చర్చకు వస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త మోటార్ వెహికిల్ చట్టంతో ఏకంగా సామాన్యుల జేబుకే కన్నమేశారు. దారితప్పి ఆదమరచి రోడ్ మీదకి వస్తే మోత మోగించేస్తున్నారు. అయితే సామాన్యులకే కాదు పోలీసులు కూడా వర్తిస్తుందని గుర్తుచేసే ఘటన చోటుచేసుకుంది. జార్ఖండ్‌లో హెల్మెట్ ధరించని కారణంగా రాకేష్ కుమార్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్‌కు ఉన్నతాధికారులు రూ34 వేలు ఫైన్ విధించారు. హెల్మెట్ లేని కారణంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా పత్రాలు లేవని, కొత్త నిబంధనలు ఎవరికైనా ఒకటేనని.. అందరూ ఒక్కటేనని అధికారులు కానిస్టేబులుకి కౌన్సిలింగ్ ఇచ్చారు.
* ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖవంశధార నదికి పెరుగుతున్న వరద నీటి ఉధృతిగొట్టా బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ ప్రస్తుత ఇన్ ఫ్లో 50,177 క్యూసెక్కులు , అవుట్ ఫ్లో 51,565 క్యూసెక్కులుఅధికారులను అప్రమత్తం చేసిన విపత్తుల శాఖకలెక్టరుతో మాట్లాడి వరద ఉధృతి వివరించిన విపత్తుల నిర్వహణ శాఖ కమీషనర్నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ శాఖ కమీషనర్ సూచన.
* కృష్ణా, తుంగభద్ర నదులు ఉప్పొంగుతున్నాయి. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద చేరుతోంది. జూరాల నుంచి 1,96,311 క్యూసెక్కులు, కర్నూలు సమీపంలోని సుంకేసుల నుంచి 38,799క్యూసెక్కులు కలిపి 2,35,110 క్యూసెక్కులు శ్రీశైలానికి వచ్చి చేరుతోంది. డ్యాం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు, పూర్తిస్థాయి సామర్థ్యం 215.81 టీఎంసీలకు గాను 878.80 అడుగుల వద్ద 181.83 టీఎంసీల నిల్వ ఉంది. ఎగువనుంచి సగటున 22.85టీఎంసీల వరద చేరుతోంది.
* చంద్రయాన్-2 ప్రయోగం ద్వారా ఇస్రో బృందం శ్రేష్ఠమైన పనితీరును కనబరిచిందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. చంద్రుడికి అతిసమీపంలోకి వెళ్లిన ల్యాండర్ నుంచి సంకేతాల్లో అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే. చంద్రుడికి 2.1 కిలోమీటర్ల దూరం వరకు సవ్యంగా సాగిన ల్యాండర్ ప్రయాణం.. అక్కడి నుంచి సంకేతాలు ఆగిపోయాయి. దీనిపై ట్విట్టర్ ద్వారా రాష్ట్రపతి తన స్పందనను తెలియజేశారు. ఇస్రో శాస్త్రవేత్తలు అంకితభావం, సాహసోపేతమైన కృషి చేశారని కొనియాడారు. భవిష్యత్‌లో సంపూర్ణ విజయాలు సాధిస్తామని ఆశిస్తున్నట్లు రాష్ట్రపతి తెలిపారు.
* బెంగళూరు ఇస్రో కేంద్రం నుంచి జాతినుద్దేశించి ప్రసంగిస్తున్నారు ప్రధాని మోదీ. భారతదేశ విజయం కోసం తీవ్రంగా ప్రయత్నించారని శాస్త్రవేత్తలను కొనియాడారు. భరతమాత శిరస్సు ఎత్తుకునేలా ఉండేందుకు జీవితమంతా ధారపోశారని అన్నారు.
*గండికోట ప్రాజెక్టులో రెండురోజులుగా నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. ప్రాజెక్టుకు వచ్చే ఇన్ఫ్లో కన్నా ఔట్ఫ్లో తక్కువగా ఉండడంతో నీటిమట్టం వేగంగా పెరుగుతూ వస్తోంది. దీంతో మండలకేంద్రమైన కొండాపురాన్ని బ్యాక్వాటర్ చుట్టుముట్టుతోంది.
*పాక్ ఉగ్రవాదులు భారతవైమానిక కేంద్రాలపై పఠాన్కోట్ తరహా దాడులకు దిగే అవకాశముందని కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాలు అందించిన సమాచారంతో భారత వాయుసేన దళాలను అప్రమత్తం చేసినట్లు ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా వెల్లడించారు.
*మునిసిపల్ చట్టం సవరణ బిల్లుకు ఈ నెల 9 నుంచి జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో ఆమోదం లభించనుంది. నిజానికి జూలై 23 నుంచి ఈ చట్టం ఆర్డినెన్స్ రూపంలో అమలులో ఉంది. రాష్ట్రంలోని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు వేర్వేరుగా ఉన్న చట్టాలను ఒక్కటిగా చేసే ఈ ఆర్డినెన్స్కు ఆరు నెలల్లో చట్టసభల ఆమోదం తప్పనిసరి.
*ఐదువేల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఐటీ మెళకువల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఐ), విద్యాశాఖ మధ్య శుక్రవారం ఎంవోయూ కుదిరింది. విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్రెడ్డి సమక్షంలో పాఠశాల విద్యా కమిషనర్ విజయకుమార్, టీసీఎస్ రీజినల్ హెడ్ రాజన్న ఎంవోయూపై సంతకాలు చేశారు.
*భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం 39.1 అడుగులకు గోదావరి ప్రవాహం చేరుకుంది. మరోవైపు ఏటూరునాగారం మండలం వద్ద గల రామన్నగూడెం పుష్కర ఘాట్ దగ్గర గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. 8.58 మీటర్లకు గోదావరి నీటి మట్టం చేరుతోంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గోదావరి ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
*జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో మొహర్రం పండుగ సందర్భంగా ఎలాంటి ఊరేగింపులకు అనుమతి ఇవ్వరాదని ఉన్నతాధికారులు నిర్ణయించారు.
*కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నుంచి శుక్రవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో స్వచ్ఛ మహోత్సవ్ అవార్డులు తీసుకుంటున్న అలోక్ తివారి (డీఆర్ఎం, గుంతకల్), స్వర్ణలత (తూర్పుగోదావరి), సౌమ్య హరిణి (వేల్పూరు, పశ్చిమ గోదావరి), జీవన్ కుమార్ (ఎన్వైకేఎస్, అనంతపురం)
*తెలంగాణ నూతన గవర్నర్గా నియమితులైన తమిళిసై సౌందరరాజన్కు భద్రతాధికారిగా కె.నర్సింహగౌడ్ను నియమిస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. నల్లగొండ జిల్లా చండూరు మండలం కొండాపురానికి చెందిన నర్సింహగౌడ్ ప్రస్తుతం వరంగల్ సెంట్రల్ జోన్ డీపీసీగా వ్యవహరిస్తున్నారు.
*గణనాథుడి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సెప్టెంబరు 12న బాలాపూర్ గణేశుడి లడ్డూను వేలం వేసిన తరువాత.. సామూహిక నిమజ్జనాల కోసం ఊరేగింపు ప్రారంభం అవుతుందని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి తెలిపింది. గతంలో కన్నా భిన్నంగా తొలిసారిగా వినాయక్ సాగర్లో గంగా హారతిని నిర్వహిస్తున్నారు. 8వ తేదీన నగరంలోని 5 ప్రాంతాల్లో భజన పోటీలు నిర్వహించనున్నారు. 12వ తేదీన నిమజ్జనోత్సవానికి ఆర్ఎ్సఎస్ చీఫ్ మోహన్ భగవత్ ముఖ్య అతిథిగా రానున్నారు.
*రాజ్భవన్లో లైజనింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్న స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ కె.విద్యాసాగర్ను ప్రభుత్వం బదిలీ చేసింది. మేడ్చల్ మల్కాజ్గిరి జాయింట్ కలెక్టర్గా ఆయనను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
*స్వామి ఉగ్ర నారసింహావతారం ఎత్తకముందే మీ బొమ్మలు, మీ పార్టీ గుర్తు కారు బొమ్మలు, పథకాల బొమ్మలను పెట్టిన స్తంభాలను తొలగించండి’’ అని సీఎం కేసీఆర్కు బీజేపీ నేత, మాజీ మంత్రి డీకే అరుణ సూచించారు. యాదాద్రి పునరుద్ధరణ చేపట్టింది. బొమ్ములువేయించుకోవడానికా అని ప్రశ్నించారు.
వైకాపా వైఫల్యాలపై తెదేపా పుస్తకం-తాజావార్తలు–09/07
Related tags :