టెన్నిస్ చరిత్రలో అత్యధిక టైటిళ్లు సాధించాలనుకున్న అమెరికా తార సెరెనా విలియమ్స్ కలను కెనడా అమ్మాయి బియాంకా ఆండ్రిస్కూ అడ్డుకుంది. యుఎస్ ఓపెన్ ఫైనల్లో దిగ్గజ క్రీడాకారిణి సెరెనాను యువ కెరటం బియాంకా మట్టికరిపించింది. మహిళల సింగిల్స్ తుదిపోరులో 6-3, 7-5 తేడాతో సెరెనాను చిత్తుగా ఓడించి కెరీర్లో తొలి టైటిల్‌ను అందుకుంది. ఇప్పటివరకు గ్రాండ్‌స్లామ్‌లో రెండో రౌండ్ కూడా దాటని బియాంకా టైటిల్‌ను నెగ్గి రికార్డులు సృష్టించింది. సింగిల్స్‌లో గ్రాండ్‌స్లామ్‌ను అందుకున్న తొలి కెనడా క్రీడాకారిణిగా ఆమె రికార్డుకెక్కింది. గత 13 ఏళ్లలో టైటిల్‌ను అందుకున్న తొలి టీనేజర్‌గానూ రికార్డు సృష్టించింది. 24వ గ్రాండ్‌స్లామ్ అందుకోవాలనుకున్న సెరెనా తుదిపోరులో ప్రత్యర్థి ముందు తలవంచింది. తొలి సెట్లో బియాంకా ఆధిపత్యం ఏకపక్షంగా సాగినా రెండో సెట్లో సెరెనా ప్రతిఘటించింది. కానీ బియాంకా చెలరేగి రెండో సెట్‌ను కూడా కైవసం చేసుకోని విజేతగా నిలిచింది.
సెరీనాకు కెనడా బ్రేకులు
Related tags :