Agriculture

భద్రాచలం వద్ద ఉప్పొంగెలే గోదావరి

Godavari High Floods Near Bhadrachalam

భద్రాచలం వద్ద గోదావరిలో వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం 46.7 అడుగులకు నీటిమట్టం చేరింది. భద్రాచలం వద్ద స్నానఘట్టాల ప్రాంతం నీటమునిగింది. దీంతో గోదావరి పరిసర ప్రాంతాల్లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ రజత్‌కుమార్‌ షైనీ సూచించారు. మరోవైపు రాజమహేంద్రవరం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటి మట్టం 11.8 అడుగులకు చేరడంతో ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. డెల్టా కాల్వలకు 8,700 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. సముద్రంలోకి 10.05 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.