మనీలాండరింగ్‌కు పాల్పడిందని ఆరోపిస్తూ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) లండన్‌కు చెందిన రోల్స్ రాయిస్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసింది. పీఎస్‌యూలైన హెచ్ఏఎల్, ఓఎన్జీసీ, గెయిల్ నుంచి 2007-11 మధ్యకాలంలో కాంట్రాక్టును పొందేందుకు మధ్యవర్తికి రూ.77కోట్ల కమిషన్ ఇచ్చిందని పేర్కొంది. ఈ ఏడాది జులైలో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) నమోదు చేసిన ఎఫ్ఐఆర్, మనీలాండరింగ్ చట్టం కింద ఈ కేసు నమోదు చేసింది. కాగా, 2000-2013 మధ్యకాలంలో హెచ్ఏఎల్తో రూ.4,700 కోట్ల వ్యాపార లావాదేవీలు నిర్వహించినట్లు సీబీఐ ఆరోపించింది. దీంతో పాటు, తన కమర్షియల్ సలహాదారుగా పేర్కొంటూ సింగపూర్‌కు చెందిన అశోక్ పంటి, ఆయన కంపెనీ ఆశామోర్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా హెచ్‌యూఎల్‌కు అవెన్ అండ్ అల్లిసన్ ఇంజిన్ విడి భాగాలను సప్లయ్ చేసినందుకు లబ్ది చేకూరుస్తూ,రూ. 18కోట్లు చెల్లించినట్లు సీబీఐ పేర్కొంది.
రోల్స్‌రాయిస్ కార్ల కంపెనీపై ఈడీ మనీలాండరింగ్ కేసు
Related tags :