1. మచ్చలకు పచ్చికూరగాయల రసం
ముఖంపై చిన్న మచ్చ కనిపించినా కంగారు పడతారు. మహిళలు ఇక ముక్కు, ముక్కుకి ఇరు వైపులా మోచేతులు, మోకాళ్ళు మెడ తదితర ప్రాంతాల్లో చర్మం నల్లగా మారిపోతే ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాంటి మచ్చలని ఆయుర్వేదంతో ఎలా నివారించోచ్చో చూద్దామా ..నల్ల మచ్చలు రావడానికి పలు కారణాలుంటాయి. ముఖ్యంగా చర్మానికి రంగునిచ్చే మేలనిస్ శరీరంపై కొన్ని చోట్ల అధిక స్థాయిలో పేరుకుపోతుంది. ఆ భాగాల్లోనే ఈ సమస్య ఎదురవుతుంది. దీంతో పాటు గర్భధారణ ప్రసవానంతరం మెనోపాజ్ సమయంలో వచ్చే హార్మోన్ల మర[పులతో మచ్చలు ఏర్పడతాయి.
**ఇవి తీసుకోవాలి
*చెంచా చొప్పున సుగంధం పాల చూర్ణం, పటిక బెల్లాన్ని కప్పు పాలతో కలిపి తాగాలి
*అర చెంచా చొప్పున మంజిస్తా చూర్ణం చందనం చూర్నానికి కొద్దిగా తేనే కలిపి రోజూ రెండు సార్లు తినాలి.
*కప్పు నీటిలో అరచెంచా చొప్పున వట్టి వెళ్ళు ఖర్జూరాల చూర్ణం వేసి పన్నెండు గంటలు నాననిచ్చి రెండు పూటలా తీసుకోవాలి.
**పై పూతగా ..
*పుల్లని పెరుగులో బార్లీ పిండిని కలిపి ముద్దలా చేసి మచ్చల పై లేపనంలా పూయాలి. పదిహేను నిమిషాల తరువాత కడగాలి. ఇలా రోజూ చేయాలి.
*నిద్రపోయే ముందు.. యాపిల్ సిదార్ వెనిగర్ మచ్చలున్న చోట రాసుకునిఒ మర్నాడు కడిగేయాలి.
*టమాటో రసాన్ని మచ్చలపై రాసి అరగంట తరువాత కడగాలి.
*కలబంద గుజ్జుని లేపనంగా వేసుకుంటే ఈ సమస్య అదుపులో ఉంటుంది.
*కొబ్బరి నూనెను సమస్య ఉన్న చోట రాసి.. గంట తరువాత సున్నిపిండితో నలుగు పెట్టుకుని స్నానం చేయాలి. రోజూ ఇలా చేస్తే మచ్చల సమస్య చాలా మటుకూ తగ్గుతుంది.
2. పండే కాదు.. తొక్క కూడా ఉపయోగమే
రోజుకో పండు తింటే శరీరానికి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పండ్లు మాత్రమే కాదు వాటి తొక్కలు కూడా చర్మానికి మేలు చేస్తాయి. అయితే ఈ తొక్కలు చర్మానికి ఎలా ఉపయోగపడుతాయో చూద్దాం.
*నారింజపండు
వీటిని తిని తొక్కలను పడేస్తారు. పిల్లలయితే తొక్కలను కంట్లో నలుపుకొని సరదాగా ఆడుకుంటారు. వీటితో అందం కూడా రెట్టింపు చేసుకోవచ్చు. నారింజ తొక్కలను ఎండబెట్టి పొడి చేయాలి. ఈ పొడికి కొంచెం పసుపు, రోజ్‌వాటర్ వేసి కలుపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడుగాలి.
*పొప్పడి
బాగా పండిన పొప్పడి గుజ్జును తీసుకోవాలి. దానికి తేనె, పాలు వేసి బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. మొటిమలు ఉంటే ఈ మిశ్రమంలో పాలకు బదులుగా నిమ్మరసాన్ని కలిపి ముఖానికి రాసుకోవాలి.
*అరటిపండు
ఈ పండుని తిని తొక్కలను తీసిపెట్టుకోవాలి. రాత్రి పడుకునే ముందు తొక్క లోపలి భాగంతో ముఖంపై రుద్దాలి. దీన్ని 15 నిమిషాల పాటు అలానే ఉంచాలి. ఆ తర్వాత చల్లని నీటితో కడుగాలి. ప్రతిరోజూ ఇలా చేస్తే ముఖం అందంగా మారడం గమనించవచ్చు.
*పుచ్చకాయ
ఎరుపు రంగులో ఉండే పుచ్చకాయ గుజ్జును తిన్న తర్వాత కాయను కొంచెంసేపు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. ఆ తర్వా త లావుగా ఉండే ముఖనికి 5 నిమిషాల పాటు మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి తేమ అందడంతో పాటు కాంతివంతంగా తయారవుతుంది.
*మామిడిపండు
వీటి తొక్కలను బాగా ఎండబెట్టి పౌడర్ చేయాలి. అందులో కొంచెం గోధుమపిండి, నీటిని వేసి బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ఐప్లె చేసి 10 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చర్మంపై ట్యాన్ తొలుగుతుంది.
3. బిరియానీ ఆకు భళా!
ఈ ఆకును బిరియానీలో తప్ప మిగతా వంటకాల్లో వాడం. వాసన కోసం వాడే ఈ ఆకులో ఎన్నో ఆరోగ్య సుగుణాలున్నాయి. వాటిని సొంతం చేసుకోవాలంటే తరచుగా వంటకాల్లో ఈ ఆకును వాడుతూ ఉండాలి.
*శ్వాసకోశ వ్యవస్థ
ఇన్‌ఫ్లమేషన్‌కు కారణమయ్యే ‘ఇంటర్‌ల్యూకిన్’ అనే ప్రొటీన్‌ను వ్యాధినిరోధక వ్యవస్థ స్వల్ప పరిమాణాల్లో విడుదల చేస్తూ ఉంటుంది. బిరియానీ ఆకు తరచుగా తీసుకుంటే ఈ ప్రొటీన్ విడుదల తగ్గుతుంది.
*కొలెస్ట్రాల్
చెడు కొలెస్ట్రాల్, చక్కెరలను తగ్గించి శరీరంలో మంచి కొలెస్ట్రాల్ తయారయ్యేలా బిరియానీ ఆకు తోడ్పడుతుంది.
*కేన్సర్
తరచుగా వంటకాల్లో బిరియానీ ఆకు వాడడం వల్ల కొన్ని రకాల కేన్సర్‌లు, ప్రధానంగా ‘కోలోరెక్టల్’ కేన్సర్ ముప్పు తప్పుతుంది.
*ఆరోమాథెరపీ
నిద్రపోయే సమయంలో దిండు పక్కనే తువ్వాలు మీద రెండు చుక్కల బే లీఫ్ ఎసెన్షియల్ ఆయిల్ వేసి పడుకుంటే, కమ్మని నిద్ర పట్టడంతో పాటు, ఉదయాన్నే కొత్త ఉత్సాహంతోనిద్ర లేస్తారు!విషాలను తరిమేయవచ్చు
శరీరంలో పేరుకునే విషపదార్ధాలను ఎప్పటికప్పుడు తరిమికొట్టకపోతే, పలు రకాల రుగ్మతలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. అయితే అందుకోసం వైద్య చికిత్సలనే ఆశ్రయించాల్సిన అవసరం లేదు. కొన్ని పానీయాలను తీసుకోవడం ద్వారా కూడా వీటిని బయటకు పంపొచ్చు.
*నిమ్మరసం, మిరియాలు
గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం, మిరియాల పొడి కలుపుకుని పరగడుపున తాగితే శరీరంలోని విషపదార్థాలు విసర్జనకు గురై జీర్ణశక్తి మెరుగవుతుంది.
*కూరగాయల రసం
క్యారెట్లు, బీట్‌రూట్ వంటి దుంపల రసాలకు కొత్తిమీర, పుదీనా, యాపిల్ రసాలను జోడించి తీసుకున్నా డిటాక్సిఫికేషన్ జరుగుతుంది.
*కలబంద
కలబంద రసం లేదా గుజ్జును నీళ్లు లేదా బత్తాయి రసంతో పరగడుపున తీసుకుంటే దేహంలోని హానికరపదార్థాలు నశించి, నీరసం తొలగి ఉత్తేజం పొందుతాం.
*ఉసిరి
మెటబాలిజం పెరిగి బరువు తగ్గడానికి ఉపయోగపడే ఉసిరి రసం శరీరాన్ని కూడా శుద్ధి చేస్తుంది. రాత్రంతా నీళ్లలో నానబెట్టిన ఉసిరి కాయలను ఉదయాన్నే మిక్సీలో రుబ్బి రోజులో మూడు సార్లు తాగాలి.
4. ఆరోగ్య ప్రదాయిని.. తిప్పతీగ..
మన చుట్టూ ఉన్న ప్రకృతిలో మనకు ఆరోగ్యాన్ని అందించే ఎన్నో రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి. కానీ చాలా వరకు మొక్కల గురించి మనకు తెలియదు. అలాంటి మొక్కల్లో తిప్పతీగ కూడా ఒకటి. ఇది మన ఇంటి పరిసరాల్లో, చుట్టు పక్కలా పెరుగుతుంది. కానీ దీని గురించి చాలా మందికి అవగాహన లేదు. తిప్పతీగను ఎక్కువగా ఆయుర్వేద ఔషధాల తయారీలో వాడుతారు. దీన్ని ఇంగ్లిష్‌లో గిలోయ్ అని, సంస్కృతంలో అమృత అని పిలుస్తారు. ఈ క్రమంలోనే తిప్పతీగ వల్ల మనం ఎలాంటి అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందామా..! తిప్పతీగ ఆకుల చూర్ణాన్ని నిత్యం తీసుకుంటే శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా ఈ సీజన్‌లో వచ్చే జ్వరాలు, వ్యాధులు, ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. తిప్పతీగలో ఉండే యాంటీ బయోటిక్, యాంటీ వైరల్, యాంటీ ఫంగస్ గుణాలు మన శరీరంలో చేరే సూక్ష్మ క్రిములను నాశనం చేస్తాయి. తిప్పతీగ ఆకుల పొడిని బెల్లంలో కలుపుకుని నిత్యం తింటే అజీర్తి తగ్గుతుంది. దీంతోపాటు జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. డయాబెటిస్ ఉన్నవారు తిప్పతీగ చూర్ణాన్ని నిత్యం ఉదయం, సాయంత్రం తీసుకుంటే ఫలితం ఉంటుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించుకోవచ్చు. నిత్యం ఒత్తిడి, మానసిక ఆందోళనలతో సతమతం అయ్యేవారు తిప్పతీగ చూర్ణాన్ని రోజూ తీసుకుంటే ఫలితం ఉంటుంది. జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. దగ్గు, జలుబు, టాన్సిల్స్ తదితర శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు తిప్పతీగ చూర్ణాన్ని వాడితే ఫలితం ఉంటుంది. ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కొద్దిగా తిప్పతీగ చూర్ణం, అల్లం రసం కలిపి నిత్యం రెండు పూటలా తాగుతుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
5. కాలేయానికి ‘పొట్టు’ భద్రత!
పొట్టుతీయని ధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్నది కొత్త సంగతేమీ కాదు. మరి ఇవి కాలేయ క్యాన్సర్ నివారణకూ తోడ్పడతాయన్న సంగతి తెలుసా? రోజుకు 7 గ్రాములు, అంతకన్నా తక్కువగా పొట్టుతీయని ధాన్యాలు తీసుకునేవారితో పోలిస్తే.. రోజుకు 33 గ్రాములు లేదా రెండు సార్లు పొట్టుతీయని ధాన్యాలు తినేవారికి కాలేయ క్యాన్సర్ ముప్పు గణనీయంగా తగ్గుతున్నట్టు తాజా అధ్యయనంలో బయటపడింది. సుమారు 24 సంవత్సరాల పాటు 1.25 లక్షల మందిని పరిశీలించి మరీ పరిశోధకులు ఈ విషయాన్ని గుర్తించారు. అదనంగా తీసుకునే ప్రతి 12 గ్రాముల ధాన్యాలకు కాలేయ క్యాన్సర్ ముప్పు 16% వరకు తగ్గుముఖం పడుతుండటం విశేషం. పొట్టుతీయని ధాన్యాల్లోని పీచు ఇన్సులిన్ నిరోధకత, రక్తంలో ఇన్సులిన్ స్థాయులు, ఒంట్లో వాపు ప్రక్రియ తగ్గటానికి తోడ్పడుతుంది. ఫలితంగా కాలేయ క్యాన్సర్ ముప్పూ తగ్గుతుందన్నమాట. ఊబకాయం, మధుమేహం, దీర్ఘకాల హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, అతిగా మద్యం తాగటం, పొగ అలవాటు వంటివన్నీ కాలేయ క్యాన్సర్‌కు దారితీస్తాయి. పీచు పదార్థం తగ్గటమూ కాలేయ క్యాన్సర్ ముప్పును తెచ్చిపెట్టొచ్చని అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి. అందువల్ల దంపుడు బియ్యం, పొట్టుతీయని గోధుమలు, చిరుధాన్యాలు, ఓట్స్ వంటివి ఆహారంలో చేర్చుకోవటం మంచిది.
కాలేయ క్యాన్సర్‌కు కారణాలు
Related tags :