తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా గవర్నర్‌గా తమిళిసై సౌందర రాజన్ బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం రాజ్‌భవన్‌లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆర్‌ఎస్ చౌహాన్ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. తమిళిసై సొంత రాష్ట్రం తమిళనాడు నుంచి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంతో పాటు మరో ఇద్దరు మంత్రులు ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు. వైద్య వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తమిళిసై.. ఆనతి కాలంలోనే అగ్రశ్రేణి మహిళా నేతగా ఎదిగారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న ఆమెను కేంద్రం తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా నియమించింది.
తమిళిసై ప్రమాణస్వీకారం
Related tags :