పార్టీ నేతలతో టీడీపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫెరెన్సు …
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటానికి పల్నాడుని రక్షించుకోవటానికే 11న ఛలో ఆత్మకూరు
తెలుగుదేశం ఒంటరి కాదు అని ఈ పర్యటన ద్వారా తెలుపుదాం
తెలుగుదేశం ఓ వ్యక్తి కాదు ఓ పెద్ద వ్యవస్థ అని ఛలో ఆత్మకూరు ద్వారా చాటుదాం
ఛలో పల్నాడుకు నాయకులంతా తరలి రావాలి
పోలీసులు పెట్టె ప్రతి అక్రమ కేసు కు సమాధానం చెప్పేలా చేద్దాం
మానవహక్కుల సంఘానికి తెలపడంతో పాటు ప్రయివేటు కేసులు నమోదు చేద్దాం
10వ తేదీన న్యాయవాదుల సమావేశం నిర్వహిస్తున్నాం
రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా లీగల్ సెల్ కి సంబంధించిన న్యాయవాదులంతా దీనికి వస్తారు
లీగల్ సెల్ ను పటిష్టపరుద్దాం
రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాడులకు, అక్రమ కేసులకు లీగల్ సెల్ అండగా ఉంటుంది
కార్యకర్తలు అంతా ధైర్యంగా ఉండాలి
వీళ్ళ ఆటలు సాగనిచ్చేది లేదు
ఇష్టానుసారం మనల్ని కొడతామంటే పడటానికి సిద్ధంగా లేము
ఎన్ని కేసులు పెడతారో పెట్టమనండి నేను చూస్తా
అందరి ముందు నెనుoటా…, ముందు నా మీద కేసు పెట్టమనండి చూద్దాం
బాబాయి ని ఎవరు చంపారో చెప్పలేని వ్యక్తి మనల్ని భయపెట్టాలని చూస్తే ఊరుకునేది లేదు
బాధితులకు బస్సులు పెట్టి ర్యాలీగా తీసుకెళదాం
10వ తేదీ రాత్రికి రాష్ట్ర వ్యాప్త బాధితులంతా పునరావాస కేంద్రానికి వస్తే అక్కడి నుంచి వారి వారి స్వస్థలాలకు వెళ్లేలా చేద్దాం
బెదిరించి, భయపెట్టి రాజకీయం చేయటం వీళ్ళ వల్ల కాదు.