‘ముక్కుపుడక పెట్టుకో మహలక్ష్మిలా..’ అని పాడుకునే రోజులు కావివి. చెవినింటిలో కొత్తగా చేరిన ఆభరణం గురించి మాట్లాడుకోవాలి అంతా. కొత్త ఎప్పుడూ వింతే కాబట్టి ఈ వింత గురించి కొంత మాట్లాడుకుందాం. చెవికి జూకాలు, దుద్దుల నుంచి సెకండ్ స్టడ్ రింగ్స్ కూడా పెట్టేసుకొని ముచ్చటపడిపోయాం ఇన్నాళ్లూ. ఇప్పుడా ముచ్చట మరి కాస్త లోపలికి అదేనండి చెవిలోపలికి దూరింది. గిరిజనుల స్టైల్ ఇప్పుడు అమ్మాయిలకు బాగా నచ్చుతున్నట్టుగా ఉంది. అందుకే చెవి లోపలివైపుగా ఉండే డెయిత్‌కు ముక్కెరలాంటి రింగ్ ను పెట్టుకుంటున్నారు. ఇవి ప్రెస్ చేసేవి, పూర్తిగా సెట్ చేసేవి వచ్చాయి. చెవికి చుట్టూత స్టడ్స్‌తో నింపే స్టైల్ నుంచి చెవికి మధ్య గోడలా ఉండే అమరికకు అందమైన రింగు తొడిగి అబ్బురపరుస్తున్నారు. ఈ స్టైల్‌నీ మీరూ ట్రై చేయచ్చు.
చెవులకు ముక్కుపుడక
Related tags :