బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ నిర్వహిస్తున్న కౌన్ బనేగా క్రోర్‌పతి సీజన్-11లో 19 ఏళ్ల యువకుడు కోటి రూపాయల ప్రశ్న ఎదుర్కోబోతున్నాడు.
ఈ సీజన్‌లో కోటి రూపాయల ప్రశ్న వరకు చేరుకున్న రెండో వ్యక్తి ఉత్తరప్రదేశ్‌కి చెందిన 19 ఏళ్ల హిమాన్షు.
ట్రైనీ పైలట్ అయిన హిమాన్షు తానెదుర్కొన్న మొదటి ప్రశ్నకే లైఫ్‌లైన్ వాడుకున్నాడు.
మొదటి ప్రశ్న తర్వాత అతను విజయవంతంగా రూ.50,00,000 గెలిచే వరకు చేరుకున్నాడు.
చివరిదైన, కోటి రూపాయల ప్రశ్న ఎదుర్కోబోతుండగా బజర్ మోగింది. ఈ ఎపిసోడ్ సోమవారం జరిగింది.
చివరి ప్రశ్న మంగళవారం ఎపిసోడ్‌లో అడుగుతారు బిగ్‌బీ.
అయితే రూ. యాబై లక్షలు గెలిచే క్రమంలో హిమాన్షు లైఫ్‌లైన్‌లు అన్ని వాడుకున్నాడు.
ఈ రోజు ఎపిసోడ్‌లో చూడాలి. అతను షోలో కంటిన్యూ అవుతాడా.. లేక యాబై లక్షలతోనే సరిపెట్టుకుంటాడా అని.
చివరి ప్రశ్నకు అతను సరైన సమాధానం చెబితే కోటి రూపాయల చెక్ అమితాబ్ చేతుల మీదుగా అందుకుంటాడు.