ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా అట్లాంటా జట్టు ఆధ్వర్యంలో ఆగష్టు 31 నుంచి సెప్టెంబర్ 2 వరకు హెలెన్ లోని యూనికాయ్ స్టేట్ పార్క్ లో పిక్నిక్ నిర్వహించారు. సుమారు 300 మంది పాల్గొన్న ఈ విహారయాత్రలో పిల్లలకు పెద్దలకు సరదా కార్యక్రమాలను నిర్వహించారు. విహారయాత్రతో ప్రారంభమయిన ఈ వనభోజనాల్లో వాటర్ స్పోర్ట్స్, జిప్ లైనింగ్, కాయకింగ్,స్కావెంజర్ హంట్, ఆర్చరీ, ఎయిర్ గన్, పాడిల్ బోర్డింగ్, వాటర్ బెలూన్స్, ఫ్లై ఫిషింగ్, షటిల్, శాక్ రేస్ తదితర ఆటపాటల్లో ప్రవాసులు ఉల్లాసంగా పాల్గొన్నారు. అనంతరం పసందైన విందును ఆరగించారు. తానా అట్లాంటా ప్రతినిధులు భరత్ మద్దినేని, వినయ్ మద్దినేని, శ్రీనివాస్ నిమ్మగడ్డ,అంజయ్య చౌదరి లావు, శ్రీనివాస్ లావు, భరత్ అవిరినేని,అనిల్ యలమంచిలి, మురళి బొడ్డు, గిరి సూర్యదేవర,సాయిరాం సూరపనేని,ఉపేంద్ర నర్రా,రాజేష్ జంపాల,సురేష్ యాదగిరి,సుధా వాణి సూరపనేని, శ్రీధర్ పాలడుగు తదితరులు ఈ కార్యక్రమ విజయవంతానికి తోడ్పడ్డారు. ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షుడు జయ్ తాళ్లూరి, మల్లికార్జున వేమన తదితరులు పాల్గొన్నారు.
ఆహ్లాదకరంగా తానా అట్లాంటా విహారయాత్ర

Related tags :