‘ఆర్ఎక్స్100’తో కుర్రకారు మతి పోగొట్టిన భామ పాయల్ రాజ్పుత్. ఆ చిత్రం విజయంతో వరుస అవకాశాలు దక్కించుకుంటూ తెలుగు చిత్ర పరిశ్రమలో దూసుకుపోతోంది. తాజాగా ఆమె కథానాయికగా నటించిన చిత్రం ‘ఆర్డీఎక్స్ లవ్’. తేజూస్ కంచర్ల కథానాయకుడు. శంకర్ భాను దర్శకత్వం వహించారు. మంగళవారం ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ను అగ్ర దర్శకుడు వి.వి.వినాయక్ విడుదల చేశారు. ‘నిజంగా మా ఊరి సమస్య తీరుతుందంటే.. ఊరంతా ఆత్మాహుతి చేసుకుంటాం’ అంటూ నరేశ్ డైలాగ్తో ప్రారంభమైన ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠ కలిగించేలా ఉంది. మరి ఆ ఊరి సమస్య ఏంటి? పాయల్ రాజ్పుత్ ఆ గ్రామంలో అడుగుపెట్టి సమస్యను ఎలా పరిష్కరించింది? అన్నది తెరపై చూడాలి. ‘వేటాడాలనుకున్న మగాడికి ఆడపిల్ల లేడి పిల్లలా కనిపించవచ్చు. అదే వేటాడాలనుకున్న ఆడపిల్లకి మగ సింహం కూడా కుక్కపిల్లలా కనిపిస్తుంది’ అంటూ పాయల్ వార్నింగ్ ఇచ్చే డైలాగ్ హైలైట్గా నిలిచింది.
మగసింహాలు మాకు కుక్కపిల్లలు

Related tags :