విటమిన్ ఇ సమపాళ్లలో అందితే శరీరానికి హానిచేసే ఫ్రీరాడి…కల్స్ దూరం అవుతాయి. చర్మం మెరిసిపోతుంది. ఇంకెన్నో ప్రయోజనాలూ ఉన్నాయి.
చర్మం నిర్జీవంగా కనిపిస్తున్నప్పుడు విటమిన్ ఇ అధికంగా ఉండే ఆహార పదార్థాలను రోజూ తినేలా చూసుకోవాలి. రోజూ ఉదయాన్నే విటమిన్ ఇ నూనెను శరీరానికి పట్టించి మర్దన చేయాలి. చర్మానికి తగిన తేమ అంది, తాజాగా కనిపిస్తుంది. ముఖ్యంగా కళ్లకింద ముడతలు, నలుపుదనం వంటివి తగ్గుతాయి. ఇలా కనీసం వారానికి రెండుమూడు సార్లు చేయాలి.
* శరీరంపై అక్కడక్కడా చారలు ఇబ్బందిపెడుతు న్నాయా… వాటిపై విటమిన్ ఇ నూనె రాసి చూడండి. చర్మకణాలు పునరుత్తేజం చెంది ఆ మచ్చలు తగ్గుముఖం పడతాయి.
* విటమిన్ ఇ లో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. దీన్ని రోజూ వాడితే అతినీలలోహిత కిరణాల వల్ల దెబ్బతిన్న చర్మానికి ఉపశమనం లభిస్తుంది. ఈ పోషకం క్లెన్సింగ్ ఏజెంట్‌లానూ పనిచేస్తుంది.
ఎందులో దొరుకుతుందంటే…
బాదం, అవిసెగింజలు, పాలకూర, చిలగడదుంప, పొద్దుతిరుగుడు గింజలు, ఆలివ్‌నూనె వంటివాటి నుంచి ఈ పోషకం అధిక మోతాదులో లభిస్తుంది. నేరుగా దీన్ని ఉపయోగించాలనుకునేవారికి మార్కెట్‌లో ఈ మాత్రలు అందుబాటులో ఉంటాయి. వైద్యుల సలహాతో వాటిని ఎంచుకోవచ్చు.
విటమిన్ ఇ ఫ్రీ రాడికల్స్ భరతం పడుతుంది
Related tags :