అమెరికాలోని చికాగో నగరంలో వినాయక నిమజ్జన వేడుకలను భక్తులు ఘనంగా నిర్వహించారు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో(ఐఏజీసీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిమజ్జన వేడుకలకు నగరంలోని ప్రవాస భారతీయులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. నిమజ్జనం సందర్భంగా విజయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా గణేష్ విగ్రహంపై పూల జల్లు కురిపించారు. బ్యాండ్ మేళాతో యువత వినాయకుడిని నిమజ్జనానికి తరలించారు. ప్రత్యేక వాహనంలో వినాయకుడి విగ్రహాన్ని తరలించి నిమజ్జన కార్యక్రమాన్ని ముగించారు.
చికాగోలో IAGC గణేశ్ నిమజ్జనం
Related tags :