మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (‘మా’)కు సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై కార్యవర్గం వివరణ ఇచ్చింది. కార్యవర్గంలో భేదాభిప్రాయాలు వచ్చాయని, అధ్యక్షుడు నరేష్‌కు రాజశేఖర్ కార్యవర్గం నోటీసులు ఇచ్చారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న ‘మా’ కార్యనిర్వాహక వర్గం వాటిని తీవ్రంగా ఖండించింది. ‘ఓ అసోసియేషన్ అంటే.. చాలా సమస్యలుంటాయి. వాటన్నింటినీ అందరూ చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ‘మా’ అభివృద్ధికి సంబంధించి అత్యవసరంగా తీసుకోవాల్సిన చర్యల గురించి మంగళవారం ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరిగింది. అసోసియేషన్‌కు సంబంధించి మీడియాకు తెలియజేయాల్సిన వార్తలేవైనా ఉంటే అధికారికంగా మేమే ప్రకటిస్తాం’ అని ‘మా’ కార్యవర్గం తెలియజేసింది.
మళ్లీ దెబ్బలాట షురూ
Related tags :