ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నానని కథానాయిక తాప్సి వెల్లడించారు. ఆమె డేటింగ్‌లో ఉన్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఛాట్ షోలో ఆమె ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడారు. పిల్లలు కావాలి అనిపించినప్పుడు వివాహం చేసుకుంటానని పేర్కొన్నారు. ‘గాసిప్స్ కోసం కాకుండా నా వ్యక్తిగత జీవితం గురించి నిజాయితీగా తెలుసుకోవాలి అనుకుంటున్న వారి కోసం చెబుతున్నా.. నాకు ఇంకా పెళ్లి కాలేదు. నా జీవితంలో ఉన్న వ్యక్తి అందరూ అనుకుంటున్నట్లు నటుడు, క్రికెటర్ కాదు. కనీసం అతడు మన చుట్టు పక్కల ప్రాంతంలో కూడా లేడు. నాకు పిల్లలు కావాలి అనిపించినప్పుడు పెళ్లి చేసుకుంటాను’ అని చెప్పారు. అనంతరం తాప్సి సోదరి షగున్ మాట్లాడుతూ.. ‘ఈ విషయంలో తాప్సి నాకు థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నా వల్లే తనకు ఆ వ్యక్తితో పరిచయం ఏర్పడింది’ అని చెప్పారు. తాప్సి ‘ఝుమ్మంది నాదం’ సినిమాతో నటిగా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో నటించిన ఆమె ఇప్పుడు బాలీవుడ్‌లో బిజీగా ఉన్నారు. అక్కడ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల ‘మిషన్‌మంగళ్’తో హిట్ అందుకున్న ఆమె ప్రస్తుతం ‘తడ్కా’, ‘షాంద్‌కీ ఆంఖ్’లో నటిస్తున్నారు. మరోపక్క తమిళ స్టార్ జయంరవి నటిస్తున్న సినిమాకు ఇటీవల సంతకం చేశారు.
నటుడితో ప్రేమలో ఉన్నాను
Related tags :