ScienceAndTech

Vivaldi బ్రౌజర్ ఇప్పుడు ఆండ్రాయిడ్‌పై కూడా

Vivaldi Browser For Android Is Released

డెస్క్‌టాప్ ప్లాట్‌ఫాంపై పేరు గాంచిన ప్రముఖ ఇంటర్నెట్ బ్రౌజర్ వివాల్డి ఇప్పుడు ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంపై అందుబాటులోకి వచ్చింది. ఈ బ్రౌజర్‌కు చెందిన బీటా వెర్షన్‌ను ఆ యాప్ డెవలపర్ ఓస్లో విడుదల చేసింది. ఈ బ్రౌజర్‌ను ఆండ్రాయిడ్ వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్‌లో ప్రస్తుతం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందులో వెబ్‌సైట్లను వేగంగా యాక్సెస్ చేసుకునేందుకు స్పీడ్ డయల్స్, ప్యానెల్స్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు. అలాగే నోట్స్ ఎడిటర్, మల్టిపుల్ డివైసెస్ బుక్ మార్క్స్ సింకింగ్, ప్రైవేట్ బ్రౌజింగ్, క్లోన్ ట్యాబ్ తదితర ఫీచర్లను కూడా ఈ బ్రౌజర్‌లో అందిస్తున్నారు.