ఎస్‌యూవీ హారియర్‌పై ఐదేళ్ల వారెంటీ ఇవ్వనున్నట్లు టాటా మోటార్స్ వెల్లడించింది. పెంటాకేర్ ప్యాకేజీ కింద ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిలో ఐదేళ్లపాటు కిలోమీటర్లతో సంబంధం లేకుండా ఈ వారెంటీ వర్తిస్తుంది. ఈ వాహనాన్ని కొనుగోలు చేసిన 90 రోజుల్లోపు రూ.25,960 చెల్లించి ఈ వారెంటీని కొనుగోలు చేయవచ్చు. ఈ వారెంటీ కింద ఇంజిన్, ఇంజిన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, ఏసీ, ట్రాన్స్‌మిషన్, గేర్‌బాక్స్, ఫ్యూయల్ సిస్టమ్, ఫ్యూయల్‌పంప్, డ్రైవర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పై వర్తిస్తుంది. దీంతోపాటు క్లచ్, సస్పెన్షన్స్‌కు సంబంధించి 50వేల కిలోమీటర్ల మేరకు ఈ వారెంటీ కవర్ చేస్తుంది. దీనిపై టాటామోటార్స్ సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్‌ప్రెసిడెంట్ ఎస్‌ఎన్ బర్మన్ మాట్లాడుతూ‘‘ కీలక భాగాల సర్వీసులు మొత్తం ఈ ప్యాకేజీలో కవర్ అవుతాయి. ఇది మా వినియోగదారులకు సౌకర్యవంతమైన యాజమాన్య అనుభవాన్ని ఇస్తుంది’’ అని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో ఎంజీ హెక్టార్, కియా వంటి కార్లు మార్కెట్లోకి రావడంతో టాటా హారియర్ విపరీతమైన పోటీని ఎదుర్కొంటోంది. ఈ సిగ్మెంట్లో ఆటోమేటిక్ గేర్ ఆప్షన్ లేని డీజిల్ ఇంజిన్‌ను కలిగిఉన్న కారు హారియర్ ఒక్కటే. ఇప్పటి వరకు టాటామోటార్స్ ఈ విభాగంలో ఆటోమేటిక్ గేర్‌ను తీసుకొచ్చే అంశాన్ని ప్రస్తావించలేదు.
ఇక 5ఏళ్లు నిశ్చింతగా
Related tags :