Kids

చాణక్యుడి నీతి తెలుసా?

Telugu Kids News - Chanakya Neethi For Kids

చాణక్య అనే పేరు జ్ఞానానికి ప్రతీకగా సూచిస్తుంది. ఆ దైవిక వ్యక్తి అయిన చాణక్య యొక్క సూత్రాలు మరియు తత్వశాస్త్రం జీవితం యొక్క కఠినతను బహిర్గతం చేస్తుంది. చాణక్యడి ఉల్లేఖనాలు మరియు సంకలనాలు ప్రజలను ప్రేరేపిస్తాయి. అలాగే జీవితం యొక్క అర్ధాన్ని తెలియజేయడంతో పాటు, ప్రవర్తన ఎలా ఉండాలన్నది నేర్పుతుంది. కొన్నిసార్లు మీరు జీవితంలో అలసిపోయినప్పుడు లేదా మనస్సు పరధ్యానంలో ఉన్నప్పుడు, మీరు చాణక్య యొక్క ఆదర్శ ఆలోచనలను చదివితే లేదా పఠిస్తే మీకు కొంత ఓదార్పు లభిస్తుంది. మానసిక చింతల నుండి మనల్ని తిరిగి శక్తివంతులను చేస్తుంది. విద్య, కుటుంబం, ప్రేమ, జీవితం, వృత్తి, స్నేహం, సంబంధం సహా అన్నింటిలో ప్రావీణ్యం పొందినవారు తెలివైనవారు మరియు ఇటువంటి వ్యక్తులు మరొకరి జీవితానికి మార్గదర్శకత్వం అవుతారు. కొన్ని విషయాలను మనం ఎక్కువగా ఇష్టపడతాం. ఆ అభిరుచి మరియు కోరిక మిమ్మల్ని జీవన విధానంలో కొంత తప్పుడు మార్గంలో నడిపిస్తాయి. అలా జరగకుండా ఉండాలనే చాణుక్యుడు కొన్ని నీతి సూత్రాలను తెలిపాడు. వీటి ద్వారా తప్పుడు మార్గాల్లో వెళ్లే వారికి ఏవిధంగా హాని జరుతుంది మరియు అటువంటి వాటికి ఏరకంగా దూరంగా ఉండాలి. వీటి వల్ల కష్టకాలంలో ఎలా బయటపడాలన్న విషయాలను చాలా అందంగా మరియు అర్థమయ్యే విధంగా చెప్పాడు చాణుక్యుడు. చాణ్యుకుడి గురించి చిన్న పరిచయం: పట్టుదలకు పౌరుషానికి, లౌక్యానికి, తెలివితేటలకు కేరాఫ్ అడ్రస్ అంటే చాణుక్యుడు. చాణుక్యుడు రాజనీతి అలా ఉంటుంది. నేటి సమాజంలో సందర్భానుసారం చాణుక్యుణ్ని అనుకరించాల్సిందే. లేదంటే మనం రాణించడం చాలా కష్టం. చాణక్యుడు మొదటి మౌర్య చక్రవర్తి అయిన చంద్రగుప్తుని ఆస్థానంలో ప్రధానమంత్రి మరియు తక్షశిల విశ్వవిద్యాలయం లో అర్దశాస్త్ర విభాగానికి అధ్యక్షుడు. కౌటిల్యుడు మరియు విష్ణుగుప్తుడు, అనే పేర్లతో కూడా చాణక్యుడిని వ్యవహరిస్తారు. చాణక్యుడు చతుర్విధపురుషార్దాలలో రెండవదైన ‘అర్ధ’ పురుషార్ధము గురించి అర్దశాస్త్రాన్ని రచించాడు. చాణక్యుడు రాజనీతి శాస్త్రంతో పాటు ఆర్థిక శాస్త్రం, భౌతిక శాస్త్రం మరియు మనస్తత్వ శాస్త్రంలో కూడా నిపుణత కనబరిచాడు. ఇతడు తన సూక్ష్మబుద్దితో శత్రువులను జయించి భారతదేశంలో మొదటి చక్రవర్తిత్వాన్ని నెలకొల్పిన విధానం విశాఖదత్తుని ముద్రారాక్షసం అనే సంస్కృత నాటకం లో వివరింపబడింది. చాణక్యుడు రచించిన నీతిశాస్త్రం చాణక్య నీతి పేరుతో ప్రసిద్ధి చెందింది.