యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) లో విలీనానికి ఆంధ్రా బ్యాంకు డైరెక్టర్ల బోర్డు ఆమోద ముద్ర వేసింది. శుక్రవారం జరిగిన బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆంధ్రా బ్యాంకు వెల్లడించింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకులను విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. దీనిపై ఇప్పటికే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ల బోర్డు చర్చించి తుది నిర్ణయం తీసుకుంది. ఎంసీఎల్‌ఆర్ రేట్లలో 5 బేసిస్ పాయింట్ల కోతను సోమవారం నుంచి అమలు చేయనున్నట్లు ఆంధ్రా బ్యాంకు ప్రకటించింది.
గంగిరెద్దులా తల ఆడించి ఒప్పేసుకున్న ఆంధ్ర బ్యాంకు బోర్డు
Related tags :