Videos

దిశా పటానీ కబుర్లు

దిశా పటానీ కబుర్లు

బాలీవుడ్‌ తార దిశాపటానీ సోషల్‌మీడియాలో చాలా చురుకుగా ఉంటారు. తనకు సంబంధించిన ఎన్నో విషయాలను, ఫిటెనెస్‌ వీడియోలను సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంటారు. అయితే ఈ ముద్దుగుమ్మ తనకు సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకోవడం కోసం ప్రత్యేకంగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించారు. తన లైఫ్‌స్టైల్‌ను తెలియచేస్తూ యూట్యూబ్‌లో మొదటి వీడియోను పోస్ట్‌ చేశారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకూ తన లైఫ్‌స్టైల్‌ను ఈ వీడియోలో చిత్రీకరించారు. జిమ్‌కి వెళ్లడం, డ్యాన్స్‌ నేర్చుకోవడం, లాక్మే ఫ్యాషన్‌ వీక్‌లో ర్యాంప్‌ వాక్‌లో పాల్గొడం వంటివి ఈ వీడియోలో చూడొచ్చు. తెలుగులో వచ్చిన ‘లోఫర్‌’ చిత్రంతో దిశాపటానీ వెండితెరకు పరిచయమయ్యారు. ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలీవుడ్‌ చిత్రం ‘భారత్‌’లో దిశాపటానీ మెరిశారు. సల్మాన్‌ఖాన్‌, కత్రినాకైఫ్‌ జంటగా నటించిన ఈ సినిమాలో దిశాపటానీ ముఖ్యపాత్రలో నటించారు.
https://www.youtube.com/watch?v=wELVWmJfPJA