పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని ముజఫరాబాద్‌లో పర్యటించిన ఆ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ముజఫరాబాద్ ప్రజలు ‘గో బ్యాక్ నాజీ’ అంటూ ఇమ్రాన్‌కు స్వాగతం పలికారు. ఆయన పర్యటన సందర్భంగా ‘కశ్మీర్ హిందుస్తాన్‌దే’ అంటూ నినాదాలు చేశారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దును చేయడంతో ఇమ్రాన్ ఖాన్ ఆగ్రహంతో రగిలిపోతూ.. భారత్‌పై విద్వేషం వెళ్లగక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన శుక్రవారం ముజఫరాబాద్ పర్యటనకు వెళ్లారు. భారత్‌లోని కశ్మీరీల దుస్థితిని, కశ్మీర్‌లో విధించిన ఆంక్షలను ప్రపంచం దృష్టికి తీసుకొచ్చేందుకంటూ ఆర్భాటంగా ఇమ్రాన్ ముజఫరాబాద్ వచ్చారు. ఇక్కడ ‘బిగ్ జల్సా’ (ర్యాలీ)లో పాల్గొంటానని చెప్పారు. కానీ, పాక్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ముజఫరాబాద్ స్థానికులు ఇమ్రాన్ పర్యటన సందర్భంగా ఆయనకు వ్యతిరేక నినాదాలతో షాక్ ఇచ్చారు.
ఇమ్రాన్‌ఖాన్ నాజీ అంటు పాక్ నిరసన
Related tags :