Kids

ఏడాది వయసులో మాటలే రేపటి మూటలు

Kids Vocab At One Year Is What Their Adult Vocab Will Be

చిట్టి బుజ్జాయిలు పెద్దయ్యాక ఎలాంటి పదాలను ఉపయోగిస్తారో, ఎలాంటి భాషా నైపుణ్యాలను పెంపొందించుకుంటారో ఏడాది వయసున్నప్పుడే అంచనా వేయొచ్చట! షెఫీల్డ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తాజాగా దీనిపై అధ్యయనం చేశారు. 11-12 నెలల వయసు బుడతలు… తల్లిదండ్రుల వైపు, వస్తువుల వైపు చూడటం; రకరకాల హావభావాలను ప్రదర్శించడం; రకరకాల శబ్దాలు వినిపించడం చేస్తుంటారు. ఇవన్నీ వారి మనసులో మాటలేనని అంటున్నారు… ప్రధాన పరిశోధకుడు ఎడ్‌ డొనెలాన్‌. అయితే ఆ సమయంలో తల్లిదండ్రులు వారికి సమాధానమివ్వడం ముఖ్యమట. అలా వారు చెప్పే మాటలనే పిల్లలు నేర్చుకుంటారని, ఇవి వారి భవిష్యత్‌ భాషా నైపుణ్యాలకు పునాది అవుతాయని డొనెలాన్‌ వివరించారు.