కావలసినవి:
చిన్న ఉల్లిపాయలు: 3 కప్పులు, ఉల్లికాడల ముక్కలు: కప్పు, పచ్చిమిర్చి: ఎనిమిది, ఇంగువ: పావు టీస్పూను, పసుపు: అరటీస్పూను, ఆవాలు: టీస్పూను, మినప్పప్పు:టీస్పూను, జీలకర్ర: అరటీస్పూను, ఉప్పు: సరిపడా, నూనె: తగినంత, వేయించిన సెనగపప్పు పొడి: 4 టీస్పూన్లు
తయారుచేసే విధానం:
బాణలిలో నూనె పోసి కాగాక ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరవాత పొట్టు తీసిన ఉల్లిపాయలు వేసి వేయించాలి. వేగాక ఉప్పు, ఇంగువ, పసుపు వేసి కలపాలి. తరవాత కొద్దిగా నీళ్లు చిలకరించి ఓ ఐదు నిమిషాలు మూతపెట్టి ఉడికించాలి. ఆ తరవాత నీళ్లన్నీ ఆవిరైపోయేవరకూ వేయించాలి. ఉల్లిపాయలు బాగా వేగాక సెనగపప్పు పొడి చల్లి దించాలి.