Movies

బోయపాటితో బాలయ్య మూడోసారి

Boyapati Balakrishna To Team Up For Third Time

నందమూరి బాలకృష్ణ-దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో మూడో సినిమా రాబోతోంది. వీరిద్దరూ ‘సింహా’, ‘లెజెండ్‌’ సినిమాలతో సక్సెఫుల్‌ కాంబినేషన్‌ అనిపించుకున్నారు. ఇప్పుడు మరో ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇంకా సినిమా టైటిల్‌ ఖరారు చేయలేదని పేర్కొన్నారు. డిసెంబరు నుంచి చిత్రీకరణ ప్రారంభం అవుతుందని తెలిపారు. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మించబోతున్నారు. మిగిలిన నటీనటులు, సాంకేతిక బృందం వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు యూనిట్‌ పేర్కొంది. బాలయ్య 106 సినిమాగా ఇది తెరకెక్కనుంది. ఎన్టీఆర్‌ బయోపిక్‌ తర్వాత బాలయ్య తన 105వ సినిమాలో నటిస్తున్నారు. కె.ఎస్‌. రవికుమార్‌ దర్శకుడు. హ్యాపీ మూవీస్‌ పతాకంపై సి.కల్యాణ్‌ నిర్మిస్తున్నారు. సోనాల్‌ చౌహాన్‌, వేదిక కథానాయికలు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో బాలయ్య యంగ్‌ లుక్‌లో కనిపించి, అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు.