Fashion

కొత్తిమీర పేస్ట్‌తో కత్తిలాంటి అందం

Cilantro Paste Enhances Skin Glow-Telugu Fashion News

కొత్తిమీర…. ఆరోగ్యాన్ని ఇవ్వడంలో ముందుంటుంది. ఇది అందాన్నీ పెంచుతుందనే విషయం మీకు తెలుసా…
* గుప్పెడు తాజా కొత్తిమీర తరుగులో రెండు చెంచాల కలబంద రసం కలిపి మెత్తగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. కలబంద ముడతలు, గీతలను తగ్గిస్తుంది.
* ముఖంపై ఉండే నలుపుదనం, బ్లాక్‌హెడ్స్‌ తగ్గించుకోవడానికి కొత్తిమీర, నిమ్మరసం చక్కని పరిష్కారం. కొత్తిమీర ముద్దలో రెండు చెంచాల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని పూతలా వేసుకుని పావుగంటాగి కడిగేస్తే చాలు.
* కొత్తిమీర ముద్దలో కాసిని పాలు, చెంచా చొప్పు తేనె, నిమ్మరసం కలపాలి. దీన్ని ముఖానికి పూతలా వేసుకుని ఆరాక కడిగేయాలి. ఇది చర్మాన్ని శుభ్రపరుస్తుంది. మెరిసిపోయేలా చేస్తుంది.