Movies

భారతీయుడి జోష్ పెంచారు

భారతీయుడి జోష్ పెంచారు

తాను కథనాయకుడిగా నటిస్తున్న ‘ఇండియన్‌ 2’ చిత్రం షూటింగ్‌ పనులను వేగవంతం చేయాలని నటుడు కమల్‌హాసన్‌ చిత్ర బృందానికి సూచించినట్లు తెలిసింది. ఆయన సూచనతో పనులు జోరందుకున్నాయి. శంకర్‌ దర్శకత్వంలో ఇండియన్‌ చిత్రం విడుదలై దాదాపు 23 సంవత్సరాలు గడిచిన తర్వాత దాని రెండో భాగం నిర్మితమవుతున్న విషయం తెలిసిందే. మొదటి విడత షూటింగ్‌ పనులు చెన్నై శివారులోని పూందమల్లి సమీపంలో జరిగాయి. సిద్దార్థ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌లపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. అనంతరం టీనగర్‌లోని ఒక హోటల్‌కు కమల్‌హాసన్‌ వస్తున్నట్లుగా చిత్రీకరించారు. వలసరవాక్కంలో విలన్‌లతో కమల్‌ ఫైట్‌ చేస్తున్న సన్నివేశాలను చిత్రీకరించారు. కాగా ఈ చిత్రం షూటింగ్‌ పనులు నత్తనడక నడుస్తున్నట్లు ఇటీవల ప్రచారం జరిగింది. ఈ పరిస్థితుల్లో చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా కలిసిన కమల్‌ షూటింగ్‌ పనుల్లో వేగం పెంచాల్సిన అవసరం ఉందని సూచించారట. ఆ మేరకు పనులు జోరందుకున్నట్లు తెలిసింది.