న్యూజీలాండ్ లో మహా బతుకమ్మ తో పాటు తొమ్మిది చోట్ల బతుకమ్మ ను నిర్వహిస్తున్న తెలంగాణ జాగృతి న్యూజిలాండ్ శాఖ వారి బతుకమ్మ పండుగ పోస్టర్ ను జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేడు ఆవిష్కరించారు . ప్రతి సంవత్సరంలాగే ఈ సారి కూడా మహా బతుకమ్మ తో పాటు 9 రోజుల బతుకమ్మ సంబరాలను 9 ప్రాంతాల్లో తెలంగాణ జాగృతి న్యూజిలాండ్ నిర్వహిస్తున్నది. ఈ సారి బతుకమ్మ పండుగలో బతుకమ్మ పాటల పోటీల తో పాటుగా బతుకమ్మలు తెచ్చే ఆడపడుచులకు చీరలను బహుకరిస్తున్నామని తెలంగాణ జాగృతి న్యూజీలాండ్ శాఖ అధ్యక్షులు ముద్దం అరుణ జ్యోతిరెడ్డి తెలిపారు. అలాగే పర్యావరణ పరిరక్షణకై జాగృతి న్యూజిలాండ్ నుండి అతిథులందరికీ మొక్కల పంపిణి చేస్తున్నది. నేడు జరిగిన బతుకమ్మ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం లో తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, జాగృతి ఆస్ట్రేలియా అధ్యక్షులు శ్రీకర్ రెడ్డి, జాగృతి రాష్ట్ర నాయకురాలు మంచాల వరలక్ష్మి, తెలంగాణ మధు, జాగృతి న్యూజిలాండ్ ప్రతినిధులు పాల్గొన్నారు.
న్యూజిల్యాండ్ బతుకమ్మ పోస్టర్ ఆవిష్కరణ
Related tags :