ఏపీలో నీటిని సక్రమంగా సద్వినియోగం చేసుకొనేందుకు ఆంధ్రా సీఎం జగన్మోహన్‌రెడ్డి తెలంగాణ సహాయ సహకారాలు కోరారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. రెండు రాష్ట్రాల రైతుల అభ్యున్నతి కోసం తాము కూడా పాత పంచాయితీలను పక్కన పెట్టి కలిసి పని చేసేందుకు సిద్ధమయ్యామని తెలిపారు. ఆదివారం శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ అంశాలపై మాట్లాడారు. ‘‘ఇరు రాష్ట్రాల ప్రయోజనాల దృష్ట్యా ఏపీతో కలిసి గోదావరి-కృష్ణా అనుసంధానానికి సిద్ధమయ్యాం. దుమ్ముగూడెం వద్ద బ్యారేజీని ప్రతిపాదిస్తున్నాం. ఈ మేరకు త్వరలోనే మళ్లీ ఆంధ్రా ఇంజినీర్లతో సమావేశమవుతాం. దీనివల్ల ఖమ్మం జిల్లాకు కూడా శాశ్వత ప్రయోజనాలు కాపాడినట్లవుతుంది. ఇక్కడ 35 నుంచి 40 టీఎంసీల నీరు ముంపు సమస్య లేకుండా నిల్వ ఉండే అవకాశం ఉంటుంది. ఈ రెండు నదుల అనుసంధానం జరిగితే ఇక రెండు రాష్ట్రాలకు నీటి సమస్య ఉండదు. కేసీఆర్ అనారోగ్యంతో ఉన్నారని చాలా దుష్ప్రచారం జరుగుతోంది. ఇక కేసీఆర్ దిగిపోయి కుమారుడు కేటీఆర్‌ను కుర్చీలో కూర్చోబెడతారని ఊహాగానాలూ వస్తున్నాయి. ఇవన్నీ అబద్ధం. నాకేమీ కాలేదు. ఆరోగ్యంగా ఉన్నా. తెరాస ప్రభుత్వం ఇంకా మూడు సార్లు అధికారంలోకి వస్తుంది. నాకిప్పుడు 66 ఏళ్లు వచ్చాయి. కనీసం ఇంకో పదేళ్లైనా పని చేయగలుగుతా. ఎవరెన్ని శాపాలు పెట్టినా నాకేం కాదు. ఇంకా రెండు పర్యాయాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా’’ అని శాసనసభలో ముఖ్యమంత్రి అన్నారు.
గివన్నీ అబద్ధాలు. నేను మస్తుగున్న. 10ఏళ్లు నేనే సీఎం.
Related tags :