ప్రముఖ నటి, దర్శకురాలు రేణూదేశాయ్ డెంగీ బారినపడ్డారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు. ఈ విషయాన్ని ఇన్‌స్టా వేదికగా రేణూ తెలిపారు. అంతేకాకుండా జ్వరాల బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి ప్రతిఒక్కరికి వివరించారు. డెంగీ జ్వరం నుంచి కోలుకుంటున్న సమయంలో షూటింగ్ చేయాల్సి వచ్చినప్పుడు నేను ఇలా ఉన్నాను అంటూ ఓ ఫొటో పోస్టు చేశారు. ‘‘ఈటీవీలో ప్రసారం చేయబోయే ‘ఢీ ఛాంపియన్’ షో కోసం కొన్ని గంటలపాటు షూటింగ్‌కి నేను నో చెప్పలేకపోయాను. దోమల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి. పొడవైన దుస్తులనే వాడండి’’ అని రేణూ పేర్కొన్నారు. సినిమాల నుంచి విరామం తీసుకున్న తర్వాత రేణూ దేశాయ్ బుల్లితెరలో ప్రసారమయ్యే రియాల్టీషోలలో మెరుస్తున్నారు. త్వరలో ఆమె రైతుల నేపథ్యంలో తెరకెక్కించే సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. అత్యంత ప్రేక్షకాదరణ పొందిన ఈటీవీలో ప్రసారమయ్యే డ్యాన్స్‌షో ‘ఢీ’ పదకొండు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుని, 12వ సీజన్‌లోకి అడుగుపెట్టనుంది. ‘ఢీ ఛాంపియన్’ పేరుతో 12వ సీజన్‌ను ప్రారంభించనున్నారు.
డెంగీ దెబ్బ నుండి….
Related tags :