Politics

Breaking: కోడెలది ఆత్మహత్యే-నిర్దారించిన వైద్యులు.

Kodela Sivaprasad Postmortem Report Is Out

ఆత్మహత్యకు పాల్పడిన మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు భౌతికకాయానికి పోస్టుమార్టం పూర్తయింది. నలుగురు ఉస్మానియా వైద్యులు పోస్టుమార్టం చేశారు. కోడెల ఉరివేసుకొని చనిపోయినట్లుగా ప్రాథమిక నివేదిక ఇచ్చారు. కాగా, కోడెల పోస్టుమార్టంను పోలీసులు వీడియో తీశారు. పోస్టుమార్టం అనంతరం ఆయన మృతదేహాన్ని అల్లుడు మనోహర్‌కు వైద్యులు అప్పగించారు. అటు నుంచి కోడెల పార్థీవదేహాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు తరలించారు.