Fashion

మేకప్ రిమూవల్ టిప్స్

Makeup removal tips for women

అలంకరణ చేసుకున్నప్పుడు రసాయనాల కారణంగా దుష్ప్రభావాలు ఎదురుకాకుండా ఉండాలంటే… ఈ జాగ్రత్తలు తీసుకుని చూడండి.
* లిప్‌స్టిక్‌లో ఉండే రసాయనాలు మేకప్‌ రిమూవర్‌తో పూర్తిగా తొలగిపోవు. ఓ పని చేయండి. బాదం నూనెలో దూదిఉండను ముంచి పెదాలపై మృదువుగా రాస్తే లిప్‌స్టిక్‌ అవశేషాలు పూర్తిగా తొలగిపోతాయి. ఈ నూనె పెదాలకు సహజ మాయిశ్చరైజర్‌గానూ పనిచేస్తుంది.
* గ్రీన్‌ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మానికి మేలు చేస్తాయి. కళ్ల కింద చర్మం ఉబ్బినట్లు ఉంటే ఒక గ్రీన్‌టీ బ్యాగును కాసేపు ఫ్రిజ్‌లో పెట్టి కంటిపై ఉంచండి. తరచూ ఇలా చేస్తే వాపుతో పాటు నలుపు సమస్య ఉన్నా అదుపులోకి వస్తుంది.
* కనుబొమల్ని ఐబ్రోపెన్సిల్‌తో దిద్దుకున్నా నిండుగా కనిపించడం లేదా… కొద్దిగా పెట్రోలియం జెల్లీ రాసుకుని చూడండి.
* జుట్టుకు వేసుకునే రంగులో ఉండే రసాయనాల కారణంగా కొంతమందికి మాడుపై పుండ్లు వచ్చే అవకాశం ఉంది. ఇలా కాకుండా ఉండాలంటే… ముందు చెవి వెనుక కొద్దిగా రంగు రాసుకోవాలి. శరీరానికి ఎలాంటి హాని జరగదని నిర్ధారించుకున్నాకే జుట్టుకు రంగు వేసుకోవాలి.