Health

పని ఒత్తిడికి విరుగుడు…పని మానేయడమే!

Stress management tips at work

పనిలో ఒత్తిడి మామూలే. ఆ ప్రభావం మీ పై పడకుండా ఉండాలంటే ఏం చేయాలో చూడండి.
* మీరు పనిచేసే చోటు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవడం తప్పనిసరి. అనవసర కాగితాలు, వృథా అనుకున్న ఇతర వస్తువుల్ని తీసేసి చూడండి. మార్పు మీకే కనిపిస్తుంది.
* మీ దినచర్య మొదలుకాకముందే ఆ రోజు ఏం చేయాలనుకుంటున్నారో ఆలోచించుకోవడం అవసరం. మీ పనికో ప్రణాళిక పెట్టుకుంటే చాలా సమస్యలు తగ్గిపోతాయి. వీలైనంతవరకూ పనుల్ని వాయిదా వేసుకోకుండా చూసుకోవాలి. ఓ పని విషయంలో ఎదురయ్యే అడ్డంకులనూ అంచనా వేయగలగాలి.
* రోజంతా కష్టపడినా పనులు తరిగిపోవు. అందుకే అదేపనిగా పనుల్లోనే ఉండిపోకుండా ప్రతి గంటన్నర లేదా రెండుగంటలకోసారి విరామం తీసుకోండి. కనీసం ఐదునిమిషాల సేపు పని నుంచి ధ్యాస మళ్లినా చాలు.
* ఒత్తిడికి గురికాకుండా ఉండాలంటే… మీరు పనిచేసేచోట ఓ పచ్చటి మొక్క, కుటుంబసభ్యుల ఫొటో వంటివి ఏర్పాటు చేసుకోండి. మనసుకు సాంత్వన కలుగుతుంది.
* విపరీతంగా ఒత్తిడికి గురవుతున్నప్పుడు పని చేయకండి. పొరపాట్లు చేసే అవకాశం ఉంటుంది. బదులుగా కనీసం పావుగంటసేపు విశ్రాంతి తీసుకోవడమే మంచిది.