తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఎర్రమంజిల్ భవనాన్ని కూల్చి అసెంబ్లీ భవనం నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు వ్యతిరేకించింది.హెరిటేజ్ భవనమైన ఎర్రమంజిల్‌ను కూల్చవద్దని స్పష్టం చేసింది.తెలంగాణ మంత్రి మండలి తీర్మానాన్ని కూడా హైకోర్టు కొట్టివేసింది. ఎర్రమంజిల్‌భవనాన్నికూల్చివేసి ఆస్థలంలో అసెంబ్లీ భవనం నిర్మిస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ జూలైనెలలో భవన నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు. ప్రభుత్వ నిర్ణయంపై ప్రజా సంఘాలు, స్వచ్చంద సంస్థలు తీవ్రంగా స్పందించాయి. వారసత్వ సంపదగా ఉన్న ఈ భవనం కూల్చివేయవద్దని ఆందోళనలు చేపట్టాయి.ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలుసంస్ధలు హైకోర్టులో పిటిషన్‌లు దాఖలుచేశాయి. దీనిపై హైకోర్టు విచారణ జరిపింది. సోమవారం తీర్పు వెలువరించింది. కోర్టు తీర్పుతో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది వేచి చూడాలి.
కేసీఆర్….బంద్ కరో!
Related tags :