NRI-NRT

హ్యూస్టన్ మోడీ సభకు ట్రంప్?

Trump to share dias with Modi at Houston

ప్రధాని నరేంద్ర మోదీ వారం రోజుల అమెరిక పర్యాటన సందర్భంగా ఆయనతో కలిపి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒకే వేదికపై పాల్గొనే అవకాశం ఉంది. ‘హౌదీ మోదీ’ పేరిట అధిక సంఖ్యలో భారతీయ అమెరికన్లు హాజరవుతున్న భారీ కార్యక్రమాన్ని ఈ నెల 22న టెక్సాస్ లోని హ్యూస్టన్ లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఉభయ దేశాల మధ్య ఓ వాణిజ్య ఒప్పందాన్ని కూడా ప్రకటించే ఆవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. జమ్మూ-కాశ్మీర్ లో 370 అధికరణం రద్దు తర్వాత ఆంక్షల విషయమై అమెరికన్ చట్టసభల ప్రతినిధులు ఆందోళన వ్యక్తంచేస్తున్న నేపధ్యంలో ట్రంప్.. ప్రధాని మోదీకి మద్దతుగా నిలిచే అవకాశం ఉంది. హౌదీ మోదీ కార్యక్రమానికి దాదాపు 50,000 మంది భారతీయ అమెరికన్లు హాజరవుతారని అంచనా