Food

ప్రతిరోజు ఒక యాపిల్ తింటున్నారా?

Are you eating an apple everyday? - Telugu food news - 09/17

రోజుకొక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం ఉండదన్నది ఆంగ్ల సామెత. ఆరోగ్యానికి యాపిల్ చేసే మేలు అలాంటిది మరి. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడుతుంది. యాపిల్, స్ట్రాబెర్రీ వంటి పండ్లలో పెక్టిన్ అనే పీచు పదార్ధం ఉంటుంది. నీటిలో కరిగే గుణం గల ఇది చెడ్డ కొలెస్ట్రాల్ తగ్గటానికి తోడ్పడుతుంది. ఫలితంగా గుండెజబ్బుల ముప్పూ తగ్గుతుంది