10 ప్రధాన బ్యాంకులను విలీనం చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో అసంతృప్తి వ్యక్తం చేసిన నాలుగు బ్యాంకు యూనియన్లు నిరసనకు దిగుతున్నాయి.
సెప్టెంబర్ 25 అర్థరాత్రి నుంచి సెప్టెంబర్ 27వరకు బ్యాంకు యూనియన్లు ధర్నాకు దిగుతున్నాయి.
దీంతో ఆ రెండు రోజులు బ్యాంకులు పనిచేయవని సమాచారం.
ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫిడరేషన్, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్, ఇండియన్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్ మరియు నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ ఆఫీసర్స్ అనే ఈ నాలుగు యూనియన్లు ధర్నాకు దిగుతున్నాయి.