కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం కాషాయ వస్త్రాలు ధరించిన వ్యక్తులు అత్యాచారాలకు పాల్పడుతున్నారని దిగ్విజయ్ సింగ్ మండిపడ్డారు.
భోపాల్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. లైంగికదాడులు ఆలయాల్లోపలే జరుగుతున్నాయని ధ్వజమెత్తారు.
సనాతన్ ధర్మాన్ని కాషాయ దుస్తులు ధరించిన కొంతమంది వ్యక్తులు నాశనం చేస్తున్నారు.
ఇది మన మతమేనా..? అని దిగ్విజయ్ ప్రశ్నించారు.
మతం పేరుతో ఇలాంటి కార్యకలాపాలకు ఒడిగట్టే వారిని దేవుడు కూడా క్షమించడని అన్నారు.